హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 10 మ్యాచ్‌ల్లో పరాజయం పాలై పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఘోర వైఫల్యం తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ జట్టులో భారీ మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా హార్దిక్ పాండ్యాను కెప్టన్సీ నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సపోర్ట్ స్టాఫ్, ప్లేయర్ల మధ్య సత్సంబంధాలు దెబ్బతినడమే ముంబై ఇండియన్స్ వైఫల్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. కోచింగ్ స్టాఫ్ అందించిన డేటా, వ్యూహాలను ప్లేయర్లు మైదానంలో అమలు చేయకపోవడంపై ముంబై యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకో జరిగిన చివరి మ్యాచ్ అనంతరం సీనియర్ ప్లేయర్లతో కోచింగ్ స్టాఫ్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్లేయర్లు ఎంతటి స్టార్లయినా కోచ్‌ల మాట వినాల్సిందేనని గట్టి సందేశం ఇచ్చినట్లు సమాచారం.

కేవలం కెప్టెన్సీ మాత్రమే కాకుండా హార్దిక్ పాండ్యా అసలు ఆటగాడిగా కూడా ముంబై జట్టులో కొనసాగుతాడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలోనే జరగబోయే ఫ్రాంచైజీ అంతర్గత సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ ఆధునిక టీ20 క్రికెట్ వేగాన్ని అందుకోవడంలో విఫలమైందని, పవర్ ప్లేలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామని జట్టు వర్గాలు అంగీకరిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు దూకుడుగా ఆడుతుంటే, ముంబై స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వెనుకబడిపోయింది.
మరోవైపు హార్దిక్ పాండ్యాకు ముంబై ఫ్యాన్స్ నుంచి మొదటి నుంచే ఆశించిన మద్దతు లభించలేదు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్‌కు బాధ్యతలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. 2024లో జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది, 2025లో కొంత మెరుగైనప్పటికీ, 2026 సీజన్ మళ్లీ తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఆటగాళ్లు, అధికారులు విరామంలో ఉన్నప్పటికీ.. త్వరలోనే ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో కొన్ని కఠినమైన నిర్ణయాలు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications