Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌తో 3డే వార్మప్ మ్యాచ్: హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాతో జరిగే వార్మప్ మ్యాచ్‌లో పాల్గొనే భారత ఏ జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత ఏ జట్టుకు టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

మంగళవారం సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో ఈ మధ్య కాలంలో రంజీ ట్రోఫీలో రాణించిన అనేక మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. ఆసీస్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే భారత్ ఏ జట్టులో హైదరాబాద్‌ యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చోటు దక్కించుకున్నాడు. 22 ఏళ్ల సిరాజ్‌ ఈ రంజీ సీజన్‌లో 9 మ్యాచ్‌లాడి 41 వికెట్లు తీసుకున్నాడు.

Hardik Pandya To Captain India A Vs Australia In 3-Day Warm-Up Match

మరోవైపు ఈ రంజీ సీజన్‌లో టాప్‌ స్కోరర్‌‌గా నిలిచిన ప్రియాంక్‌ పంచల్‌, సర్వీసెస్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ సింగ్‌, రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, బాబా ఇంద్రజిత్‌ వంటి ఆటగాళ్లు భారత ఏ జట్టులో చోటు దక్కించుకున్నారు. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు వార్మప్ మ్యాచ్ జరగనుంది.

ఈ వార్మప్ మ్యాచ్ కోసం రంజీ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 23న పుణెలో ప్రారంభం కానుంది.

భారత్ ఏ జట్టు:
హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), అఖిల్‌ హెర్వాద్కర్‌, ప్రియాంక్‌ పంచల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అకింత్‌ బావ్నె, రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), షాబాజ్‌ నదీమ్‌, కృష్ణప్ప గౌతమ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, అశోక్‌ దిండా, రాహుల్‌ సింగ్‌, బాబా ఇంద్రజిత్‌.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+