IND vs PAK: బౌలింగ్ చేయడు.. బ్యాటింగ్ రాదు! భారత జట్టులో అతడు ఎందుకు ఉంటున్నాడో అర్ధం కావడం లేదు!

హైదరాబాద్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. 2019 నుంచి హార్దిక్ తనదైన శైలిలో బ్యాట్ జులిపించడం లేదు. వెన్నముఖ శస్త్రచికిస్త కారణంగా చాలా రోజులు జట్టుకు దూరమైన హార్దిక్.. అడపాదడపా జట్టులోకి వస్తూపోతూ ఉన్నాడు. బ్యాటింగ్‌ చేస్తున్నా.. బౌలింగ్ మాత్రం చేయడం లేదు.

శ్రీలంక సిరీస్, ఐపీఎల్ 2021లో కూడా బౌలింగ్ చేయలేదు. దాంతో టీ20 ప్రపంచకప్‌ 2021కి అతడిని ఎంపిక చేయడంతో కొందరు మండిపడ్డారు. ఇక తుది జట్టులో ఆడించొద్దని మరికొందరు అన్నారు. అయితే ఆదివారం పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచులో హార్దిక్ విఫలమయ్యాడు. దాంతో నెటిజన్లు మరోసారి అతడిపై మండిపడుతున్నారు.

బౌలింగ్ చేయడు.. బ్యాటింగ్ రాదు

పాకిస్థాన్‌తో ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌‌లో 10 వికెట్ల తేడాతో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌ చేసిన హార్దిక్ పాండ్యా అంచనాల్ని అందుకోలేకపోయాడు. 8 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన హర్హిక్.. కేవలం రెండు ఫోర్లు మాత్రమే బాదాడు. మరీ ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో బంతిని తనదైన శైలిలో బలంగా బాదడంతో అతను విఫలమయ్యాడు.

దాంతో భారత ఫాన్స్ అతడి ఎంపికపై గుర్రుగా ఉన్నారు. 'బౌలింగ్ చేయడు.. బ్యాటింగ్ రాదు! భారత జట్టులో అతడు ఎందుకు ఉంటున్నాడో అర్ధం కావడం లేదు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'హార్దిక్ బదులుగా శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాల్సింది' అని ఇంకొకరు ట్వీటారు. 'ఇషాన్ కిషన్ ఆడినా బాగుండు', 'భారత్ బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ అని, బౌలింగ్ చేసేటప్పుడు బ్యాటర్ అని చెప్పండి' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

IND vs PAK: విరాట్ కోహ్లీ క్రీడాస్ఫూర్తి.. ఓడిపోయినా కూడా!!

పాండ్యాకు గాయం

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చేయలేకపోవడానికి కారణం.. అతను గాయపడటమేనని సమాచారం తెలుస్తోంది. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్ కోసం పాండ్యా బ్యాట్ ఊపగా.. బంతి మాత్రం కనెక్ట్ కాలేదు. అదే సమయంలో అతని భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం కారణంగా బ్యాటింగ్ అనంతరం హార్దిక్ ఫీల్డింగ్‌కి కూడా రాలేదు. ఆ సమయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్, ఫిజియోతో డ్రెస్సింగ్ రూములో మాట్లాడుతూ కనిపించాడు. హార్దిక్ బదులుగా ఇషాన్ కిషన్ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచాడు. మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మెడికల్ టీమ్ తెలిపింది.

కిషన్ లేదా శార్దూల్

గ్రూప్ స్టేజ్‌లో మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయిన భారత్ జట్టు ఇక సెమీస్‌కి చేరాలంటే.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంది. న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్టును భారత్ ఢీ కొనాల్సి ఉంది. ఈ మ్యాచులో టీమిండియాకు విజయం తప్పనిసరి. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమైనా పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వెన్ను గాయానికి సర్జరీ చేయించుకుని బౌలింగ్‌కి దూరంగా ఉంటున్న పాండ్యాని.. బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే టీమిండియా ఆడిస్తోంది. హార్దిక్ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా శార్దూల్ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

T20 World Cup: Hardik Pandya Injured - Twitterati Disappointed
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, October 25, 2021, 12:38 [IST]
Other articles published on Oct 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X