Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా చేయడం పెద్ద నేరం.. వారి వల్లే ఓటమిపాలయ్యాం: హార్దిక్ పాండ్యా

MI vs GT: టీ20 క్రికెట్‌లో బౌలర్లు నో-బాల్స్ వేయడం పెద్ద నేరమని ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరి ఓవర్లో వేసిన నో-బాల్ మ్యాచ్ రిజల్ట్‌ను ప్రభావితం చేసిందని.. తక్కువ స్కోరు నమోదు చేసినప్పటికీ బౌలర్ల పోరాటమే ఆట ముగింపుకు కారణమని హార్దిక్ పాండ్యా అన్నాడు.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి బంతి వరకు పోరాడి ఓడిపోయింది. గుజరాత్ గెలవడానికి చివరి బంతికి కేవలం ఒక పరుగు అవసరం అయినప్పుడు .. బ్యాటింగ్ లో ఉన్న అర్షద్ ఖాన్ సింగిల్ తీసుకోవడానికి పరిగెత్తాడు. హార్దిక్ పాండ్యా బంతిని నేరుగా స్టంప్స్ పైకి విసిరాడు. కానీ అది స్టంప్స్‌ను దాటి వెళ్లిపోయింది. దీంతో గుజరాత్ జట్టు సులభంగా ఒక పరుగు సాధించి ఉత్కంఠ భరిత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. దీని తర్వాత గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ రెండు సార్లు ఆగిపోయింది. చివరికి గెలవడానికి ఒక ఓవర్లో 15 పరుగులు ఉండగా.. దీపక్ చాహర్ పేలవంగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై జట్టు పరాజయం పాలైంది. అంతే కాకుండా వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తర్వాత ముంబై వరుస విజయాల పరంపరకు ముగింపు పలికింది.

Hardik Pandya Blames No-Balls for MI s Loss Against Gujarat Titans

ఓటమి గురించి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. తాము మంచి పోరాటం చేశామని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. విజయం కోసం ఒక జట్టుగా కలిసి పోరాడామని.. కానీ ఈ పిచ్‌పై మాకు ఇంకా రన్స్ ఉండేవన్నారు. నా అంచనా ప్రకారం.. ముంబై జట్టు 25 పరుగులు తక్కువ చేసిందని హార్దిక్ చెప్పాడు. అయితే ఓటమికి దగ్గరగా రావడానికి బౌలర్లే బాధ్యత వహించాలన్నాడు. ఈ మ్యాచ్‌లో క్యాచ్‌ల కంటే నో-బాల్స్ ఎక్కువగా బౌల్ చేశామని తాను అనుకుంటున్నానన్నారు. చివరి ఓవర్లో నో-బాల్ గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదన్నాడు. టీ20 క్రికెట్‌లో నో-బాల్స్ వేయడం మరణశిక్ష విధించదగిన నేరంగా తాను భావిస్తానన్నాడు. ఎందుకంటే నో-బాల్స్ ద్వారా వచ్చే పరుగులు ఖచ్చితంగా ప్రభావం చూపుతాయన్నాడు. ముంబై జట్టులోని అందరు ఆటగాళ్లు 120 శాతం ఇవ్వడం చూసి సంతోషంగా ఉందన్నాడు. ఎందుకంటే తక్కువ స్కోరు చేసినప్పటికీ చివరి వరకు పోరాడామని చెప్పాడు. వర్షం వల్ల ఆటను రెండుసార్లు ఆపివేసి.. తప్పుగా తిరిగి ప్రారంభించారని హార్దిక్ పాండ్యా అన్నాడు. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లు మొత్తం 3 నో-బాల్స్ వేశారు. అందులో హార్దిక్ పాండ్యా 2 నో-బాల్స్ వేయడం గమనార్హం.

Story first published: Wednesday, May 7, 2025, 7:54 [IST]
Other articles published on May 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+