For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL: వచ్చే సీజన్‌లో హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం.. ఎందుకంటే?

ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ -2025 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. అంతేగాక రూ. 30 లక్షల భారీ జరిమానా చెల్లించాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. వాంఖడే వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 214 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75; 29 బంతుల్లో, 5x4, 8x6), కేఎల్ రాహుల్ (55; 41 బంతుల్లో, 3x4, 3x6) అర్ధశతకాలతో రాణించారు. నువాన్ తుషారా (3/28), పీయూష్ చావ్లా (3/29) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (68; 38 బంతుల్లో, 10x4, 3x6), నమన్ ధిర్ (62*; 28 బంతుల్లో, 4x4, 5x6) పోరాడారు. రవి బిష్ణోయ్ (2/37), నవీనుల్ (2/50) తలో రెండు వికెట్లు తీశారు.

Hardik Pandya Banned Set to Miss IPL 2025 Opener - Here s Why

అయితే ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్‌పై ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. స్లో ఓవర్ రేటు‌ కారణంగా రూ. 30 లక్షలు కోత విధిస్తున్నుట్లు తెలిపారు. హార్దిక్‌తో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మతో సహా రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం.. ఏదీ తక్కువగా ఉంటే అది జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు.

స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ జరిమానాకు గురికావడం ఇది మూడో సారి. ఈ సీజన్‌లో అంతకుముందు రెండు సార్లు అతను ఫైన్ కట్టాడు. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడోసారి స్లో ఓవర్ రేటుకు కారణమైన కెప్టెన్‌పై బీసీసీఐ.. లీగ్‌లో ఓ మ్యాచ్‌కు నిషేధం విధిస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు ముగిశాయి. దీంతో వచ్చే సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు హార్దిక్‌ దూరం కానున్నాడు. అంటే ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్‌కు హార్దిక్‌పై నిషేధం విధించారు.

Story first published: Saturday, May 18, 2024, 9:28 [IST]
Other articles published on May 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+