Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నువ్వే నా ప్రాణం అన్న న‌టాషా.. సిగ్గుపడుతున్న హార్దిక్ (వీడియో)

Hardik Pandya asks Natasha Stankovic ‘baby main kya hu tera’, her hilarious response makes him blush

ముంబై: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు క్రీడారంగం కుదేలవ్వగా.. సినిమారంగం స్థంభించింది. అటు టోర్నీల్లేవ్.. ఇటు షూటింగ్‌ల్లేవ్. దీంతో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్‌ పాండ్యా, బాలీవుడ్ హీరోయిన్ నటాషా స్టాన్‌వికోవిచ్‌ ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కాబోయే భార్య నటాషాతో హార్దిక్ కలిసి ఇంట్లో సరదాగా గడుపుతూ.. సందడి చేస్తున్నాడు.

నువ్వే నా ప్రాణం:

నువ్వే నా ప్రాణం:

లాక్‌డౌన్‌ సమయంలో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలను నటాషా-హార్దిక్ జంట తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నటాషాకు హిందీ నేర్పిస్తున్న హార్ధిక్‌.. ఓ సరదా వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'బేబీ.. నేను నీకు ఏమౌతాను' అని హార్దిక్ అడగ్గా.. దానికి నటషా కొంత సమయం తీసుకుని వచ్చిరాని హిందీలో 'నువ్వే నా ప్రాణం' అని సమాధానం ఇచ్చింది. నటాషా సమాధానంతో హార్ధిక్‌ సిగ్గుపపడిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

దుబాయ్‌లో నిశ్చితార్థం:

దుబాయ్‌లో నిశ్చితార్థం:

ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలో భాగంగా దుబాయ్‌ వెళ్లిన నటాషా-హార్దిక్.. అక్కడే నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్ధం సమయంలో హార్థిక్.. నటాషాకు ఓ రింగ్‌ను కూడా బహూకరించాడు. సముద్రంలో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకొని తమకు ఎంగేజ్‌మెంట్ అయిందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

గతేడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్‌ పాండ్యా ఆటకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సిరీస్‌లకు దూరమయ్యాడు. కివీస్ పర్యటనకు ఎంపికవుతాడనుకున్నా.. పూర్తి ఫిట్‌నెస్‌ లేకపోవడంతో తప్పుకున్నాడు. అయితే దేశవాళీ టోర్నీలో సత్తాచాటాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక కరోనా కారణంగా ఐపీఎల్-13 కూడా వాయిదా పడడంతో పునరాగమనం కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

'సత్యాగ్రహ' చిత్రంతో తెరంగేట్రం:

మంచి డాన్సర్ అయిన నటాషా స్టాన్‌కోవిచ్‌.. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ' చిత్రంతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది. బిగ్‌బాస్‌ (హిందీ 8)లో పోటీపడటంతో ఆమెకు క్రేజ్‌ పెరిగింది. ఆమె ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా ఉంది. సెర్బియాలో పుట్టిన నటాషా ముంబైలోనే స్థిరపడింది.

Story first published: Tuesday, April 14, 2020, 14:17 [IST]
Other articles published on Apr 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+