Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రేయసి కోసం ఓట్లు ఆడుగుతున్న హార్ధిక్ పాండ్యా.. ఎందుకో తెలుసా!!?

Hardik Pandya appeals for votes on behalf of Natasa Stankovic on Nach Baliye

ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్నునొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స కారణంగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు హార్దిక్ దూరమయ్యాడు.

స్టాన్కోవిక్‌తో డేటింగ్‌:

స్టాన్కోవిక్‌తో డేటింగ్‌:

గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా సినీ నటి, డ్యాన్సర్ నటాషా స్టాన్కోవిక్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది మేలో పాండ్యానే స్వయంగా నటాషాను తల్లిదండ్రులకు పరిచయం చేశాడని తెలుస్తోంది. పాండ్యా తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించారని.. త్వరలోనే వీరి పెళ్లి జరిపించేందుకు సిద్ధమైనట్లు కూడా సమాచారం తెలుస్తోంది. ఇక పాండ్యా సోదరుడు కృనాల్ కూడా వీరి పెళ్ళికి ఓకే చెప్పాడట.

ప్రేయసి కోసం విజ్ఞప్తి:

ప్రేయసి కోసం విజ్ఞప్తి:

డ్యాన్సర్ నటాషా స్టాన్కోవిక్‌ ప్రస్తుతం రియాలిటీ డ్యాన్స్ షో 'నాచ్ బలియే'లో పాల్గొంటోంది. నటాషా తన మాజీ ప్రియుడు, నటుడు అలీ గోనితో కలిసి రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తోంది. నాచ్ బలియే తొమ్మిదో సీజన్‌లో తన ప్రేయసి గెలవాలనే తపనతో హార్దిక్ నటాషాకు మద్దతు ఇస్తున్నాడు. హార్ధిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నటాషా, అలీల ఫొటో షేర్ చేసి వారిని గెలిపించాలని అభిమానులను కోరాడు. 'నటాషా, అలీలకు మీ మద్దతు కావాలి.. ఓటు వేసి గెలిపించండి' అని ప్రేయసి కోసం విజ్ఞప్తి చేసాడు.

సత్యాగ్రహ సినిమాతో పరిచయం:

సత్యాగ్రహ సినిమాతో పరిచయం:

ముంబైకు చెందిన నటాషా ఓ సెర్బియన్ నటి మరియు డ్యాన్సర్. బాలీవుడ్‌లో ప్రకాశ్ ఝా దర్శకత్వంలో వచ్చిన 'సత్యాగ్రహ' సినిమాలో నటించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహారిస్తోన్న 'బిగ్ బాస్' సీజన్ 8లోనూ కంటెస్టంట్‌గా పాల్గొంది. 'డీజే వాలా బాబు' పాటతో ఒక్కసారిగా అందరి చూపు తనవైపుకి తిప్పుకుంది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్, అనుష్క శర్మ జీరో మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం మాజీ బాయ్‌ప్రెండ్ గోనీతో నాచ్ బాలియే సీజన్ 9లో నటిస్తోంది.

అవ్రామ్, రౌటేలా, ఈషాలతో ఎఫైర్:

అవ్రామ్, రౌటేలా, ఈషాలతో ఎఫైర్:

హార్దిక్ పాండ్యా గతంలో ఎల్లీ అవ్రామ్, ఊర్వశీ రౌటేలా, ఈషా గుప్తాలతో డేటింగ్ చేశాడు. ఇప్పుడు నటాషా స్టాన్కోవిక్‌తో ప్రేమలో ఉన్నాడు. ఇటీవలే శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. హార్దిక్‌ పాండ్యా త్వరగా కోలుకోవాలని జట్టు యాజమాన్యం చూస్తోంది.

Story first published: Tuesday, October 29, 2019, 16:05 [IST]
Other articles published on Oct 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+