'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన పాండ్యా

హైదరాబాద్: బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మహిళలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపాయి. దీంతో తన వ్యాఖ్యల పట్ల హార్ధిక్ పాండ్యా క్షమాపణ చెప్పాడు.
కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి పాండ్యా, కేఎల్ రాహుల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ వారి యొక్క క్రష్, లైప్ స్టైల్, పార్టీలు, బాలీవుడ్‌కు సంబంధించిన అనేక విషయాలను కరణ్ జోహార్‌తో పంచుకున్నారు.
ఈ సందర్భంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా "నేను ఈ మధ్యకాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్. మూడోది రిలేషన్‌షిప్" అని సమాధానమిచ్చాడు.
పాండ్యా చేసిన ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే కాకుండా, భారత సంస్కృతిని దిగజార్చాలే ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాండ్యా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేయడంతో పాటు మండిపడ్డారు.
దీంతో దెబ్బకు దిగొచ్చిన పాండ్యా... 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాడు. ఎవరి సెంటిమెంట్లను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. టాక్ షో నేటివిటీని కొనసాగించే ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేశానంటూ ట్విట్టర్‌లో పాండ్యా వివరణ ఇచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications