For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తండ్రైన హార్దిక్ పాండ్యా!!

Hardik Pandya and Natasa Stankovic blessed with baby boy

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా తండ్రయ్యాడు. హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిక్ గురువారం వడోదరలో పండంటి అబ్బాయికి జన్మనిచ్చారు. తల్లి, బిడ్ద ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సోషల్ మీడియా ద్వారా హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో బాబు చేయి పట్టుకున్న ఫొటోను హార్దిక్ పంచుకున్నాడు. 'నటాషా, నేను పండంటి అబ్బాయికి జన్మనిచ్చాం' అని కాప్షన్ రాసుకొచ్చాడు. అభిమానులు, సహచర ఆటగాళ్లు హార్దిక్ పాండ్యాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మే 31న నటాషా స్టాంకోవిక్‌ గర్భధారణ విషయాన్ని హార్దిక్‌ పాండ్యా ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'మా కుటుంబంలోకి మూడవ వ్యక్తి రాబోతున్నాడు' అని పేర్కొన్నాడు. అప్పటి నుంచి భాగస్వామి నటాసాతో తాను గడుపుతున్న క్షణాలను ఫొటోల రూపంలో పాండ్యా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా నటాషా స్టాంకోవిక్‌ను వెనుకనుంచి హార్దిక్ కౌగిలించుకోగా.. ఇద్దరు కలిసి తమ చేతులను నటాషా కడుపు మీద అపురూపంగా పెట్టిన చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. దీనికి హార్దిక్ 'హార్ట్ విత్ రిబ్బన్' ఎమోజీని శీర్షికగా పెట్టాడు.

గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 957, పొట్టి క్రికెట్‌లో 310 పరుగులు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌.. శస్త్ర చికిత్స తర్వాత ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీకి సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్‌ కారణంగా ఆ సిరీస్ రద్దు అయింది. ఇక ఈ ఏడాది ఐపీల్‌ 13వ సీజన్‌ సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్యలో యూఏఈలో నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఈ ముంబై ఆటగాడు త్వరలోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది.

నటాషా స్టాంకోవిక్‌తో కొంతకాలం సహజీవనం చేసిన హార్దిక్ పాండ్యా.. ఈ ఏడాది ఆరంభంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆపై ఇద్దరు పెళ్లిపీటలెక్కారు. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ' చిత్రంతో నటాషా స్టాన్‌కోవిచ్‌ బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేశారు. బిగ్‌బాస్‌ (హిందీ 8)లో పోటీపడటంతో ఆమెకు క్రేజ్‌ పెరిగింది. ఆపై పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా గడిపారు. ఇక ఈ ఏడాది నుండి పూర్తిగా పాండ్యానే ఉంటున్నారు. సెర్బియాలో పుట్టిన నటాషా ముంబైలోనే స్థిరపడ్డారు.

Story first published: Thursday, July 30, 2020, 16:51 [IST]
Other articles published on Jul 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+