బుమ్రా, హార్దిక్‌ను వెలుగులోకి తెచ్చాం.. పంత్‌ను తీర్చిదిద్దాం అయినా సమర్థత లేదంటారా?

న్యూఢిల్లీ: జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాం. రిషభ్ పంత్‌ను తీర్చిదిద్దాం అయినా మా సెలక్షన్ కమిటీకి సమర్థత లేదంటారా అని భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆరోపించారు. సెలక్షన్ కమిటీ సమర్థతపై వస్తున్న విమర్శలకు పైవిధంగా ఎమ్మెస్కే ఘాటుగా బదులిచ్చాడు. అంతేకాదు ఒక సెలక్షన్ కమిటీకి ఉండాల్సిన అర్హతలేంటో కూడా వివరించారు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

సెలక్షన్ కమిటీ అవి చాలు:
తాజాగా ఎమ్మెస్కే మీడియాతో మాట్లాడుతూ... 'సెలక్టర్ కనీస సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి ఉండాలి అన్నది కేవలం ఒక అంశమే. ఎన్ని మ్యాచులు ఆడాడు, అంతర్జాతీయ అనుభవం ఎంత ఉంది ఇక్కడ సమస్య కాదు. నిజాయతీ, నిబద్ధత, సమగ్రత, గోప్యత నాలుగు కీలక నైపుణ్యాలు సెలక్షన్ కమిటీ సభ్యులకు అవసరం. మా కమిటీ ఈ నాలుగు ఉన్నాయని 100% చెప్పగలను' అని ఎమ్మెస్కే వివరించారు.

ప్రత్యామ్నాయం తెచ్చాం:
'మా సమర్థత, దార్శనికతపై ఎన్నో ఉదాహరణలు చూపించగలను. సెలక్షన్ కమిటీకి దార్శనికత లేకుంటే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలర్ల జాబితాలో నంబర్ వన్ బౌలర్ ఎలా అయ్యాడు. టీ20లకే పనికొస్తాడనుకున్న హార్దిక్ ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అశ్విన్, జడేజా వంటి స్పిన్నర్ల స్థానంలో చహల్, కుల్దీప్‌లను ప్రత్యామ్నాయంగా తెచ్చాం' అని ఎమ్మెస్కే తెలిపారు.

యువతపై దృష్టి:
'యువతపై ఎక్కువ దృష్టి పెట్టాం. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఎలా మెరుగయ్యారో చూడండి. ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీలతో పేస్ బౌలింగ్ బలం పెరిగింది. రిషభ్ పంత్‌ను తక్కువ వ్యవధిలోనే టెస్టుల్లో ప్రవేశపెట్టాం. టీమిండియా కన్నా ముందే భారత్-ఏ జట్టుతో పర్యటనలు చేయిస్తున్నాం. కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌లతో సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించాం' అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.

ధోనీ ఉత్తమ ఫినిషర్:
'ఎంఎస్ ధోనీ ఇప్పటికీ భారత్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఉత్తమ ఫినిషర్, కీపర్. ఫినిషర్ విషయంలో జట్టులో మరికొందరు ఎదుగుతున్నారు. జట్టుకు తన అనుభవాన్ని పంచడంలో, కెప్టెన్ నిర్ణయాలు తీసుకొనేందుకు సాయం చేయడంలో ధోనీ బలం. సెమీస్ గెలిచుంటే జడేజా, ధోనీ ఆడిన ఇన్నింగ్స్ భారత చరిత్రలో నిలిచిపోయేది' అని ఎమ్మెస్కే అన్నారు

తగినన్ని అవకాశాలు ఇస్తాం:
దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్‌లకు ధోనీని ఎంపిక చేస్తారాఅనే ప్రశ్నకు బదులిచ్చాడు. 'ప్రపంచకప్ తర్వాత రిషభ్ పంత్ ఎదిగేందుకు, ఆత్మవిశ్వాసం పెంచుకొని అంచనాల మేరకు రాణించేందుకు అతడికి తగినన్ని అవకాశాలు ఇచ్చేలా ప్రణాళిక రచించాం. జట్టు అవసరాలకు తగ్గట్లు అతడు రాణించాలన్నది మా ఆలోచన' అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చారు.

జట్టు పునర్నిర్మాణం నిరంతర ప్రక్రియ:
'జట్టు పునర్నిర్మాణం నిరంతర ప్రక్రియ. టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. భారత్-ఏలో గొప్ప ప్రదర్శన చేసిన యువకులకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవకాశాలు ఇచ్చాం. టీమిండియాలో బాగా రాణించి వారు తమ స్థానం పదిలం చేసుకొవాలని కోరుకుంటున్నాం' అని ఎమ్మెస్కే ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications