IPL 2025 MI vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచి సీజన్ 18లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రూమర్ గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియా కూడా వాంఖడే స్టేడియంలో ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కనిపించింది. ఇది మాత్రమే కాదు.. మ్యాచ్ అనంతరం జాస్మిన్ వాలియా కూడా ముంబై ఇండియన్స్ బస్సులో కూర్చుని కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
హార్ధిక్-జాస్మిన్ డేటింగ్?
హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా డేటింగ్ గురించి చాలా కాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో కూడా భారత్ ఆడుతున్న మ్యాచ్ సమయంలో జాస్మిన్ వాలియా టీమిండియా ఉత్సాహపరుస్తూ కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో జాస్మిన్ హార్దిక్ పాండ్యా జట్టు ముంబైని ఉత్సాహపరిచేందుకు చేరుకుంది. మ్యాచ్ తర్వాత జాస్మిన్ వాలియా ముంబై ఇండియన్స్ జట్టు బస్సు ఎక్కడం కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వారి డేటింగ్ గురించి ఊహాగానాలు మరోసారి తీవ్రమయ్యాయి.

హార్దిక్ పాండ్యా నటి, సెర్బియన్ మోడల్ నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. గ్రీస్ వెకేషన్ లో ఫోటోలు, వీడియోలలో ఇద్దరూ పోజులివ్వడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం వివిధ మ్యాచ్ లకు ఈ అందాల భామ హాజరు కావడంతో ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. భారత సంతతికి చెందిన బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియా ఇంగ్లాండ్ లోని ఎసెక్స్ లో జన్మించారు.