Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా బ్రేకప్?.. కారణం ఇదేనా!

Hardik Pandya-Jasmin Walia: భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ హాండ్యా, బ్రిటీష్ మోడల్ నటి జాస్మిన్ వాలియా విడిపోయారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ప్రేమ బంధంలో ఉన్న వీరిద్దరూ.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మానేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరు తమ ప్రేమకు గుడ్ బై చెప్పేశారని పుకార్లు వినిపిస్తున్నాయి.

భారత స్టార్ క్రికెట్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత బ్రిటీష్ గాయని, మోడల్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విడాకులకు ముందే హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్‌కు చెందిన మోడల్ నటి జాస్మిన్ వాలియాతో ప్రేమ సంబంధంలో ఉన్నాడని గుసగుసలు వినిపించాయి. కానీ ఈ విషయంపై అటు జాస్మిన్ కానీ, హర్దిక్ పాండ్యా గానీ స్పందించిన దాఖలాలు లేవు. గతేడా ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలోనే జాస్మిన్ వాలియా ముంబైకి వచ్చింది.

Hardik Pandya and Jasmin Walia Breakup Fans Suspect Split After Unfollowing on Instagram

ఆ తర్వాత జాస్మిన్ వాలియాతో విదేశాలకు వెళ్ళిన హార్దిక్ పాండ్యా.. భారత జట్టుతో ప్రయాణించేటప్పుడు కూడా ఆమెను తీసుకెళ్లడం ప్రారంభించాడు. జాస్మిన్ వాలియా నిరంతరం ఇండియాలో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వచ్చింది. ఒక దశలో జాస్మిన్ వాలియాకు కూడా అభిమానులు పెరగడం ప్రారంభించారు. దానికి తగ్గట్టుగా జాస్మిన్ వాలియా హిందీలో విడుదలైన కొన్ని వీడియో పాటలలో నటించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో ఒకరినొకరు ఫాలో అవ్వడం మానేశారు. ఇద్దరి ఫాలోవర్స్ జాబితాలో ఒకరి పేరు కూడా లేదు.

దీంతో హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని పుకార్లు వినిపిస్తున్నాయి. గత ఒకటిన్నరేళ్లకు పైగా హార్దిక్ పాండ్యా - జాస్మిన్ వాలియా ప్రేమించుకుంటుండగా.. త్వరలో పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఆశించారు. ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలో జాస్మిన్ వాలియా ముంబై జట్టు బస్సులోనే ప్రయాణించింది. ఆ స్థాయిలో వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్లు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య బ్రేకప్ జరగడానికి గల కారణం గురించి ఇప్పటివరకు సమాచారం వెలుగులోకి రాకపోవడం గమనార్హం. కానీ జాస్మిన్ వాలియా భారత్ విడిచి తిరిగి ఇంగ్లాండ్‌కు వెళ్లిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు ధ్రువీకరిస్తున్నాయి.

Story first published: Saturday, July 19, 2025, 18:53 [IST]
Other articles published on Jul 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+