కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఎదురులేదు.. ఆల్రౌండర్‌గా హార్దిక్‌కు తిరుగులేదు.. తొలి టీ20లో ఇండియా ఘన విజయం

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198పరుగులు చేయగా.. ఇక 199పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ టార్గెట్ ఛేదించేలా కన్పించలేదు. ఆ జట్టు 19.3ఓవర్లలో 148పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇండియా 50పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా (4-0-33-4) 4ఓవర్లలో 4వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ బ్యాటర్ల భరతం పట్టగా.. యుజ్వేంద్ర చాహల్ 2, హర్షల్ పటేల్ 1, భువనేశ్వర్ కుమార్ 1, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. రోహిత్ శర్మకు కెప్టెన్‌గా టీ20ల్లో ఇది వరుసగా 13వ విజయం కావడం గమనార్హం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు.

అదిరిపోయిన ఆరంభం
ఇక భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్‌కు షాకిచ్చాడు. ఇరువైపులా స్వింగ్ చేస్తూ అదరగొట్టాడు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్‌గా తన అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న జాస్ బట్లర్.. భువీ బౌలింగ్లో అయిదో బంతికి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఇక కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్ డక్ అయి చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున టీ20లో అరంగేట్రం చేసిన అర్షదీప్ సింగ్.. సైతం తన స్వింగ్‌తో తొలి ఓవర్లో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో తన మొదటి ఓవర్‌ను మొయిడిన్ వేశాడు.

ఒకే ఓవర్లో రెండు వికెట్లతో చెలరేగిన పాండ్యా
ఇక బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లోనూ సత్తా చాటాడు 5వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. అతని దెబ్బకు డేవిడ్ మలన్ (21పరుగులు) క్లీన్ బౌల్డ్ కాగా, లివింగ్ స్టోన్ (0) కీపర్ క్యాచ్‌గా డకౌట్ అయ్యాడు. ఇక పవర్ ప్లే పూర్తయ్యేసరికి టీమిండియా కమాండింగ్ పొజిషన్లో ఉంది. ఇక పవర్ ప్లేలో ఇండియా బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 32పరుగులు మాత్రమే చేయగలిగింది.

మొయిన్ అలీ, బ్రూక్ ఆదుకునే ప్రయత్నం చేసినా..
ఇక బ్యాటింగ్లో బాగా తడబడ్డ ఓపెనర్ జాసన్ రాయ్.. 7వ ఓవర్లో హర్దిక్ పాండ్యా బౌలింగ్లో (16బంతుల్లో 4పరుగులు) క్యాచ్ ఔటయ్యాడు. ఇక 33పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్‌ను బ్రూక్ (28పరుగులు 23బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్), మొయిన్ అలీ (36పరుగులు 20బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు 5వికెట్‌కు 61పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మధ్యమధ్యలో వీరి క్యాచ్‌లను భారత ఫీల్డర్లు మిస్ చేశారు. ఇక 94పరుగుల వద్ద వీరి జోడీని చాహల్ విడదీశాడు. బ్రూక్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. తర్వాత కాసేపటికే మొయిన్ అలీని స్టంప్ ఔట్ చేశాడు. దీంతో 100పరుగులకు 6వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ఇక ఓటమికి చేరువైంది.

తొలి వికెట్ తీసిన అర్షదీప్ సింగ్
అప్పటికే రిక్వయిడ్ రన్ రేట్ 16కి మించిపోవడంతో క్రీజులో ఉన్న సామ్ కరన్ (4పరుగులు) హిట్టింగ్ చేయాలని చూసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. 16వ ఓవర్ చివరి బంతికి టైమల్ మిల్స్ (7పరుగులు 8బంతుల్లో)ను హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. ఇక 18వ ఓవర్ చివరి బంతకి టోప్లే (9)ని అర్షదీప్ ఔట్ చేయడంతో అతనికి అంతర్జాతీయ కెరీర్లో తొలి వికెట్ పడింది. ఇక చివరకు పార్కిన్సన్‌ను అర్షదీప్ డకౌట్ చేయడంతో ఇంగ్లాండ్ 19.3ఓవర్లకు 148పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ విజయాల పరంపర
ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు బ్యాట్ ఝలిపించడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. దీపక్ హుడా (17బంతుల్లో 33), సూర్యకుమార్ యాదవ్ (19బంతుల్లో 39) దుమ్ముదులుపగా.. హార్దిక్ పాండ్యా (51పరుగులు 32బంతుల్లో) అంతర్జాతీయ కెరీర్లో తన తొలి హాఫ్ సెంచరీ చేయడంతో ఇండియాకు 198పరుగుల భారీ స్కోరు లభించింది. రోహిత్ శర్మ సైతం (24పరుగులు) ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో రోహిత్ శర్మ ఖాతాలో ఇప్పటి వరకు కెప్టెన్‌గా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా టీ20ల్లో 13విజయాలు నమోదయ్యాయి. ఈ రికార్డు సాధించిన తొలి కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

తుది జట్లు
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్ అండ్ కెప్టెన్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లీ, మాథ్యూ పార్కిన్సన్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications