అంతా సస్పెన్షన్ వల్లే!: ఫామ్‌పై హార్ధిక్ పాండ్యా

హైదరాబాద్: తనపై విధించిన సస్పెన్షన్ మానసికంగా మరింత బలోపేతం కావడానికి కారణమైందని ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఐదింట విజయం సాధించి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 37 (5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో దిగిన ముంబై ఇండియన్స్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమయ్యాయి. పవన్ నేగి వేసిన 19వ ఓవర్‌లో హార్ధిక్ పాండ్యా (0, 6, 4, 4, 6, వైడ్, 1)తో మొత్తం 22 పరుగులు రాబట్టుకున్నాడు.

ఆరు మిగిలుండగానే ముంబై విజయం
దీంతో మరో ఆరు బంతులు మిగిలుండగానే ముంబైకి విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ "ప్రతీ ఒక్కరి జీవితంలో కష్టకాలం అనేది ఉంటుంది. అలానే నా జీవితంలో కూడా చోటు చేసుకుంది. ఇదే నా ప్రదర్శన మెరుగు పడటానికి కారణమైంది. నేను ధృఢంగా మారడానికి అవకాశం కల్పించింది" అని చెప్పాడు.
తనపై విధించిన సస్పెన్షన్‌పై కూడా పాండ్యా స్పందించాడు. "ఆ సమయం నాకు చాలా క్లిష్టమైనది. కానీ నా మైండ్ సెట్‌ను మొత్తం మార్చేసింది. నా ఫిట్‌నెస్ లెవెల్‌తో పాటు ఆటపై మరింత దృష్టి పెట్టడానికి కారణమైంది. మానసికంగా మరింత బలోపేతం కావడానికి నాపై విధించిన సస్పెన్షనే ప్రధాన కారణం" అని హార్ధిక్ పాండ్యా తెలిపాడు.

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్
ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో హార్దిక్ పాండ్యా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పాండ్యా మాట్లాడుతూ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని తెలిపాడు.

టీమిండియాకు అనుకూలం
ఈ పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా మారుతాయిని పాండ్యా తెలిపాడు. "ఇంగ్లాండ్‌లో పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాం. ఈసారి మాత్రం అవి టీమిండియాకు హెల్ప్ అవుతాయి. ఆట అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అది ఐపీఎల్ అయినా లేక వరల్డ్‌కప్ అయినా" అని పాండ్యా అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications