Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: సిరీస్ గెలవాలంటే.. హార్దిక్ ఈ నిర్ణయాలు తీసుకోకతప్పదు!

Hardik needs to take these decisions to seal INDvsSL T20I series

శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. దీనికోసం ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిరీస్ తొలి మ్యాచులో నెగ్గి శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచులో ఓటమి పాలైంది. లంక నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. ఈ క్రమంలో మూడో మ్యాచ్ నెగ్గి సిరీస్ దక్కించుకోవాలంటే టీమిండియా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదు.

బౌలర్లను తెలివిగా వాడుకోవాలి!

బౌలర్లను తెలివిగా వాడుకోవాలి!

భారత్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్, శివమ్ మావి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో బౌలర్లను హార్దిక్ తెలివిగా ఉపయోగించుకోవాలి. పవర్‌ప్లేలో అద్భుతంగా రాణిస్తున్న అతను డెత్ బౌలింగ్ భారాన్ని కూడా భుజాలకు ఎత్తుకోక తప్పేలా లేదు.

ఎందుకంటే ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి ఈ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నారు. అలాగే క్రీజులో శ్రీలంక లెఫ్ట్ హ్యాండర్లు లేనప్పుడే చాహల్‌తో బౌలింగ్ చేయించడం ఉత్తమం. దీనివల్ల భారత బౌలింగ్ సమిష్టిగా రాణించే అవకాశం ఉంటుంది.

మిడిలార్డర్‌లో మార్పులు..

మిడిలార్డర్‌లో మార్పులు..

టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో కూడా కొన్ని కీలక మార్పులు చేయడం ద్వారా మూడో మ్యాచ్‌లో భారత్ గెలవచ్చు. అది ఎలాగంటే మిడిలార్డర్‌లో ముందుగా హార్దిక్ పాండ్యా దిగుతున్నాడు. అతను తన స్థానాన్ని మార్చుకొని, స్పిన్‌ బౌలర్లపై ఎదురు దాడి చేయగలిగే దీపక్ హుడా వంటి వాళ్లను ముందుగా బ్యాటింగ్‌కు పంపితే బెటర్.

సూర్యకుమార్ కూడా మంచి స్పిన్ హిట్టరే. వీళ్లిద్దరూ కలిస్తే మిడిలార్డర్‌లో భారీగా పరుగులు పిండుకోవచ్చు. ఇక డెత్ ఓవర్లలో లంక పేసర్లను హార్దిక్, అక్షర్ కలిసి ఎదుర్కోవచ్చు. కాబట్టి హార్దిక్ తన బ్యాటింగ్ పొజిషన్‌ను ఆరో స్థానానికి మార్చుకుంటే ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతుంది.

ఓపెనర్ల స్ట్రాటజీ..

ఓపెనర్ల స్ట్రాటజీ..

ఈ సిరీస్‌లో టీమిండియాను తెగ ఇబ్బంది పెడుతున్న విషయం ఓపెనర్ల వైఫల్యం. శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్లే నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా.. రెండో మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. లంక బౌలర్లు మధుశంక, రజిత పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు.

కరుణరత్నే, మహీష్ తీక్షణ కూడా పవర్‌ప్లేలో వికెట్లు తీసుకుంటున్నారు. పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు కోల్పోతే ఇక టీమిండియా ఎగ్రెసివ్‌గా ఎలా ఆడుతుంది? కాబట్టి మొదటి రెండు ఓవర్లలో బంతి స్వింగ్‌ను అర్థం చేసుకోవడానికి నిదానంగా ఆడి, ఆ తర్వాత భారీ షాట్లకు ఓపెనర్లు ప్రయత్నించడం బెటర్. ఇలాంటి స్ట్రాటజీ వల్ల ఆరంభంలోనే వికెట్లు కోల్పోకుండా జట్టుకు మంచి శుభారంభం అందించే అవకాశం ఉంటుంది.

Story first published: Saturday, January 7, 2023, 9:03 [IST]
Other articles published on Jan 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+