ధోనీ బర్త్‌డే.. రాంచీలో పాండ్యా బ్రదర్స్ ధూంధాం!

రాంచీ: మోడ్రన్ ఇండియా మోస్ట్ లవబుల్ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం 39వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో భార్య సాక్షి సింగ్, కూతురు జీవాతో కలిసి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో ఎలాంటి హంగామా లేకుండా మహీ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ధోనీ అత్యంత సన్నిహితులు మాత్రం అతన్ని స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే భారత స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు ధోనీ ఫామ్‌హౌస్‌కు స్వయంగా వచ్చి నిరాడంబరంగా జరిగిన ధోనీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ధోనీ కుటుంబ సభ్యులతో ఈ బరోడా బ్రదర్స్ అత్యంత సన్నిహితంగా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా.. ధోనీ ఫ్యామిలీ జరుపుకునే ప్రతీ ఫంక్షన్‌కు హాజరవుతుంటాడు.

View this post on Instagram

Let The Celebrations Begin !! 🥳❤💥🔥

A post shared by MS Dhoni Fans Club (@dhoni.bhakt) on

ఇక పాండ్యా బ్రదర్స్ రాంచీ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వీడియోను సోషల్ మీడియా వేదికగా ధోనీ అభిమానులు షేర్ చేశారు. కరోనాను సైతం లెక్క చేయకుండా ఈ పాండ్యా బ్రదర్స్ స్వయంగా వచ్చి విష్ చేయడం ధోనీ అభిమానులను ఆకట్టుకుంది. భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన మహీకి సహచర క్రికెటర్లతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పారు. కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్న మహీ.. ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డులెక్కాడు. ఎన్ని ఘనతలు సాధించినా ఓ కర్మయోగిలా తన పనిచేసుకుంటూ పోతాడు. అందుకే ప్రపంచ క్రికెట్‌లో ఓ ఐకాన్‌గా నిలబడ్డాడు.

అక్తర్‌ను చూసి సచిన్ భయపడేవాడు.. అతను ఈ విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోడు: అఫ్రిది

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, July 8, 2020, 12:58 [IST]
Other articles published on Jul 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X