న్యూఢిల్లీ: క్రికెట్ మైదానంలో హర్భజన్ గురించి మనకందరికీ తెలుసు. అప్పుడప్పుడు బ్యాటింగులోనూ మెరుపులు మెరిపిస్తుంటాడు. అయితే, ఢిల్లీలో జరుగుతున్న కాంటినెంటర్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోటీల్లో భజ్జీ పాల్గొన్నాడు.

భారత క్రికెట్ జట్టు ఆఫ్ స్పిన్నర్ భజ్జీ రెజ్లింగ్ రింగ్‌లో సత్తా చాటాడు. రెజ్లర్ కంటే ముందుగానే రింగ్‌లోకి దూరి నిలబడిన భజ్జీ.. తనపై రెజ్లర్ పంచ్ విసరగానే చాకచక్యంగా తప్పించుకున్నాడు. తన పంచ్ మిస్ అయిందనే షాక్ నుంచి సదరు ప్రొఫెషనల్ తేరుకునేలోగానే భజ్జీ ఊహించని విధంగా పంచ్ విసిరాడు.

దీంతో కండలు తిరిగిన శరీరంతో ఉన్న సదరు రెజ్లర్.. భజ్జీ దెబ్బకు కిందపడిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. ఇటీవల హర్యానాకు చెందిన ఓ సాధారణ మహిళ రెజ్లింగ్ రింగ్‌లోకి దిగి ప్రొఫెషనల్ రెజ్లర్‌ను మట్టి కరిపించింది.