'అతడితో జాగ్రత్త'.. రోహిత్ సేనను హెచ్చరించిన హర్భజన్
పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియాను హెచ్చరించాడు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆ పాక్ ప్లేయర్ తో జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే?
ఈ నెల 23న...
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరిగినప్పటికీ.. టీమిండియా మ్యాచులు మాత్రం దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. భారత ఆటగాళ్లను పాక్ దేశానికి పంపిడానికి బీసీసీఐ ఒప్పుకోకపోవడంతో హైబ్రిడ్ మోడల్ లో టోర్నీని నిర్వహిస్తున్నారు. అలానే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత్-పాక్ మ్యాచ్ ఈనెల 23న జరగనుంది.

అతడితో జాగ్రత్త..
ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు హర్భజన్ సింగ్. అతడి గురించి మాట్లాడుతూ.. రోహిత్ సేనను హెచ్చరించాడు. "టీమిండియాకు విజయాన్ని దూరం చేసిన అనుభవం ఫకర్‌కు ఉంది. అతడితో జాగ్రత్త." అని హర్భజన్ పేర్కొన్నాడు.
భారత్ పై ఫకర్ రికార్డ్..
వన్డేల్లో టీమిండియాపై ఫకర్‌కు మంచి రికార్డే ఉంది. ఆడిన ఆరు మ్యాచుల్లోనూ 46.80 యావరేజ్ తో, 82.39 స్ట్రైక్ రేట్ తో 234 పరుగులు చేశాడు. కాగా, భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచులో గొప్ప ప్రదర్శన చేసే ఆటగాళ్లలో హార్దిక్ పాండ్య, రిజ్వాన్, ఫకర్ జమాన్ ఉంటారని రీసెంట్ గానే మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications