హైదరాబాద్: టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అయితే బాగుంటుందని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయమై మంగళవారం హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు.
'టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ బెన్స్ ఆప్షన్ అనేది నా అభిప్రాయం' అని ట్విట్టర్‌లో భజ్జీ ట్వీట్ చేశాడు. హర్భజన్ సింగ్ ట్వీట్ చేసిన తర్వాత సోషల్ మీడియా నెటిజన్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి జహీర్ ఖాన్ 2015లో రిటైరయ్యాడు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ ఇద్దరూ ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు తమ సేవలందించారు. 38 ఏళ్ల జహీర్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
మరోవైపు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. జహీర్ ఖాన్ టీమిండియా తరుపున 92 టెస్టుల మ్యాచ్‌లతో పాటు 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. 2000లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
అదే ఏడాది ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. చివరిసారిగా జహీర్ ఖాన్ ఫిబ్రవరి 2014లో భారత్ తరుపున న్యూజిలాండ్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఉన్నాడు. సంజయ్ బంగర్ బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.