Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మారేది క్యాలెండర్‌ మాత్రమే.. మీ ఉద్యోగం, లక్ష్యాలు ఏమీ మారవు'

New Year 2020: Harbhajan Singh, Virat Kohli, VVS Laxman Other Teamindia players Wish Fans a ‘Happy New Year’

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్నో జ్ఞాప‌కాల‌తో కూడిన 2019 సంవ‌త్స‌రానికి గుడ్‌బై చెప్పి 2020కి ఘ‌న స్వాగ‌తం ప‌లికాం. నూతన సంవ‌త్స‌రంలో కోరుకున్న ప‌నులు జ‌ర‌గాల‌ని, ఈ ఏడాది కూడా అంతకుమించి జ్ఞాప‌కాల‌తో సంతోషంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. నూతన సంవ‌త్స‌రం సందర్భంగా టీమిండియా క్రికెటర్లు, మాజీలు సోష‌ల్ మీడియా ద్వారా తమ అభిమానుల‌కి శుభాకాంక్ష‌లు తెలిపారు. కొత్త సంవ‌త్స‌రం అందరి జీవితంలో కోటి ఆశ‌ల‌ని చిగురింప‌జేయాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు.

మారేది క్యాలెండర్‌ మాత్రమే:

మారేది క్యాలెండర్‌ మాత్రమే:

టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అభిమానులకు నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపాడు. 'అందరికి నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. కొత్త ఏడాదిలో అంతా మారిపోతుందని ఉత్సాహపడకండి. మారేది కేవలం క్యాలెండర్‌ మాత్రమే. మీ భాగస్వామి, ఉద్యోగం, లక్ష్యాలు ఏమీ మారవు. ఇది గుర్తుచేస్తున్నా' అంటూ హర్భజన్‌ ట్వీట్ చేశారు.

అంతా మంచే జరగాలి:

అంతా మంచే జరగాలి:

'ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అంతా మంచే జరగాలని ప్రార్ధించా' అని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేసాడు. '2019 ప్రతిఒక్కరికి సంతృప్తికరంగా గడిచిందని ఆశిస్తున్నా. 2020 మరింత బాగా ఉండాలని కోరుకుంటున్నా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని అనుష్క శర్మ పేర్కొంది.

 దయ, ప్రేమను పంచడానికి శ్రమించాలి:

దయ, ప్రేమను పంచడానికి శ్రమించాలి:

'గత దశాబ్దానికి, 2019కి వీడ్కోలు. నూతన సంవ‌త్స‌రంకు ఘన స్వాగతం. ఈ నూతన దశాబ్దంలో ప్రపంచానికి దయ, ప్రేమను పంచడానికి మనం శ్రమించాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని సురేశ్‌ రైనా ట్వీట్ చేసాడు. 'ప్రతిఒక్కరికి ఆ భగవంతుడు శాంతి, ఆనందాన్ని అందిస్తాడని ఆశిస్తున్నా. కొత్త జీవితం, ఉజ్వల భవిష్యత్తుకు స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీటాడు.

దృఢంగా ఉండండి:

దృఢంగా ఉండండి:

'విజయం దిశగా అడుగులు వేసేటప్పుడు ఎంతో దృఢంగా ఉండండి. లక్ష్యం సాధించే క్రమంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. అయితే గెలిచిన తర్వాత వచ్చే ఆనందం కంటే అవి చిన్నవే. అభిమానులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని పేసర్ మహ్మద్‌ షమీ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, January 1, 2020, 11:46 [IST]
Other articles published on Jan 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+