Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుల్వామా ఉగ్రదాడి: టెర్రరిజంపై ఇమ్రాన్ ఖాన్ చర్యలు తీసుకోవాలి

Harbhajan Singh urges Pakistan PM Imran Khan to take immediate action against perpetrators

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి భారత్, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణాన్ని స్ఫురిస్తుంది. ఇప్పటికే దేశం మొత్తం పాకిస్తాన్ పై తీవ్ర కోపంతో ఊగిపోతోంది. చాలా మంది పాకిస్థాన్ కు యుద్ధం తోనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే హర్భజన్ సింగ్ ఇమ్రాన్ ఖాన్ ను టెర్రరిజం ఆపాలని, భారత్ లో జరిగే టెర్రరిజం కు ఇక నుంచైనా శుభం కార్డు పలకాలని తెలిపారు. అయితే ఇప్పటీకే ఇప్పటికే హర్బజన్ పాకిస్తాన్ తో ఎట్టి పరిస్థితిలో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కొండబద్దలు కొట్టినాడు.

ఇమ్రాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి సరైనా చర్యలు చేపట్టాలి

ఇమ్రాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి సరైనా చర్యలు చేపట్టాలి

హర్భజన్ ఇంకా మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి సరైనా చర్యలు చేపట్టాలని, కానీ వాటిని ఎలా రూపుమాపాలని మేము అర్ధం చేసుకొని మీకు చెప్పలేము. కానీ టెర్రరిజం దాడుల్లో ఏ ఒక్క సైనికుడు తమ ప్రాణాలను కోల్పోకూడదని, సైనికలను కోల్పోతే ఆ భాద వారి కుటుంబ సభ్యులకు మాత్రమే అర్ధం అవుతుంది" అని హర్భజన్ భావోద్వేగం తో చెప్పుకొచ్చారు.

భారత్ మా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదు

భారత్ మా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదు

అయితే ఇదివరకే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ "భారత్ మా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదు, ఆలోచించకుండా తిరిగి దాడి చేస్తాం. టెర్రరిజం పెంచి పోషించడం, లేదా వేరే దేశం మీద కు పంపించడం మాకు కూడా శ్రేయస్కరం కాదు" అని చెప్పుకొచ్చాడు. భారత్ తమపై ఆరోపణలు చేయడం మాని ఉగ్రదాడిపై ఆధారాలు చూపితే ఏమైనా చర్యలు తీసుకోగలము" అని స్పష్టం చేశారు.

ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధం ఉంది

ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధం ఉంది

అలా కాదని తమపై దాడికి దిగితే ధీటైన సమాధానం చెప్పేందుకు పాక్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు జారీ చేశారు. పుల్వామా ఘటన లో 40మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. దీనికి దాయాది దేశం పాకిస్థానే కారణమంటూ ప్రజలంతా ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే పాక్ క్రికెటర్ల ఫోటోలను వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు తీసేసిన సంగతి తెలిసిందే.

భజ్జీ వ్యాఖ్యలపై బీసీసీఐ సీనియర్‌ అధికారి

భజ్జీ వ్యాఖ్యలపై బీసీసీఐ సీనియర్‌ అధికారి

పాక్‌తో మ్యాచ్‌ ఆడరాదంటూ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు స్పందించారు. "అది హర్భజన్‌ వ్యక్తిగత అభిప్రాయం. లీగ్‌ దశలో ఆడం సరే... అదే ఏ సెమీస్‌లోనో, ఫైనల్లోనో ఆడాల్సి వస్తే మ్యాచ్‌ వదిలేసుకుంటామా? నిజానికి కార్గిల్‌ యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో కూడా మనం 1999 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడలేదా" అని ఆయన గుర్తు చేశారు.

Story first published: Wednesday, February 20, 2019, 13:04 [IST]
Other articles published on Feb 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+