Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ‌ర్భ‌జన్‌.. నీకు కరోనా వస్తే తెలుస్తది!! పిచ్చిపిచ్చి పోస్ట్‌లు చేయ‌కు!

Harbhajan Singh trolled by Fans for asking whether Indians need Coronavirus Vaccine

హైదరాబాద్: క‌రోనా మహమ్మారి ఏడాది కాలంగా వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అని ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. భారత్‌తో పాటు ర‌ష్యా, చైనా, అమెరికా, బ్రిట‌న్ ‌లాంటి దేశాలు ఇప్ప‌టికే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి.. అడ్వాన్స్‌డ్ ట్ర‌య‌ల్స్‌లో ఉన్నాయి. అమెరికాలో అయితే ఫైజ‌ర్ వ్యాక్సిన్ క్రిస్మ‌స్ లోపే అందుబాటులోకి వ‌స్తుంద‌న్న వార్త‌లూ వస్తున్నాయి. భారత్‌లోనూ మ‌రో మూడు, నాలుగు నెల‌ల్లో వ్యాక్సిన్ ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. ఇప్ప‌టికే చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం భారీగా ఆర్డ‌ర్లు ఇస్తున్నాయి.

వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా?:

వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా?:

వాస్తవానికి భారత్‌లో వృద్దులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పితే.. ఇతరులు ఎవరూ ఈ మహమ్మారికి బలవడం లేదు. భారత్‌లో క‌రోనా మహమ్మారి నుంచి కోరుకున్న వారి సంఖ్య దాదాపు 93.6 శాతంగా ఉంది. దీనిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈరోజు ఉదయం ఓ ట్వీట్ చేశాడు. 'ఫైజ‌ర్ వ్యాక్సిన్ 94 శాతం, ఆక్స్‌ఫ‌ర్డ్ 90 శాతం, మోడెర్నా 94.5 శాతం స‌మ‌ర్థ‌వంతం అని ప్ర‌క‌టించుకున్నాయి. భారత్‌లో ఏ వ్యాక్సిన్ లేకుండానే 93.6 శాతం మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు చెప్పండి.. భారత్‌కు అస‌లు వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా?' అని ట్వీట్ చేశాడు.

పిచ్చి పోస్ట్‌లు చేయ‌కు:

పిచ్చి పోస్ట్‌లు చేయ‌కు:

క‌రోనా వ్యాక్సిన్ అవసరమా అంటూ హ‌ర్భ‌జ‌న్ సింగ్ చేసిన ట్వీట్ కొన్ని క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ‌ర్భ‌జన్‌ను‌ విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. 'ఇలాంటి పిచ్చి పోస్ట్‌లు చేయ‌కు అని ఒకరు భ‌జ్జీపై మండిప‌డగా.. 'కాస్త లాజిక్‌తో ఆలోచించు' అని మరొకరు సూచించారు. 'నీ లాజిక్ చూస్తే.. శాస్త్రవేత్తలు ఏడుస్తారు', 'నీకు కరోనా వస్తే తెలుస్తది' అని మరికొందరు హ‌ర్భ‌జన్‌ను‌ ఆడుకుంటున్నారు. 'చరాస్ (గంజాయి) తాగి ట్వీట్ చేశావా?', 'ఇలాంటి జట్టు నుండి మీరు (ఎంఎస్ ధోనీ) బయటపడ్డారు' అని మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

 ఇది క్రికెట్ మ్యాచ్ కాదు:

ఇది క్రికెట్ మ్యాచ్ కాదు:

140 కోట్ల మందిలో 6.4 శాతం మంది అంటే ఎంతో తెలుసా.. అంత మంది పోతేపోనీ అని అనుకుంటున్నావా అని ఓ యూజ‌ర్ హ‌ర్భ‌జన్‌ను‌ నిల‌దీశాడు. ఓ స్పిన్న‌ర్ బౌలింగ్ చేస్తుంటే ప్యాడ్స్ ఎందుకు.. బాల్ త‌గిలినా త‌ట్టుకునేంత బ‌ల‌మైన ఎముక‌లు ఉన్నాయి క‌దా అని మ‌రొక యూజ‌ర్ సెటైర్ వేశాడు. 'టీకా అవసరం.. రివ్యూ తీసుకోవడానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదు', 'భారత క్రికెట్ జట్టులోని ప్రతి ఒక్కరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉంది. అలా అయితే టీమిండియా అన్ని మ్యాచ్‌లను గెలవాలి. కానీ అలా కుదరదు. గణాంకాలు తప్పుదారి పట్టించగలవు' అని కామెంట్లు చేస్తున్నారు.

స్విచ్‌హిట్‌తో 100 మీటర్ల సిక్స్.. మ్యాక్స్‌వెల్‌ షాట్ చూస్తే షాకే!! నిబంధనలకు లోబడే!

Story first published: Thursday, December 3, 2020, 15:44 [IST]
Other articles published on Dec 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+