న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్ హార్భజన్ సింగ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ గీతా బస్రాను అక్టోబర్ 29న వివహం చేసుకుని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. చంఢీగడ్‌కు చెందిన 'ద ట్రిబ్యున్' న్యూస్ పేపర్ ఈరోజు (ఆగస్టు 22) ప్రచురించిన వార్తా కథనం ప్రకారం వీరిద్దిరి పెళ్లి అక్టోబర్ 29న జలంధర్‌లో జరుగుతుంది.
బాలీవుడ్ నటి అయిన గీతా బస్రాతో గత కొన్ని సంవత్సరాల నుంచి హర్భజన్ ప్రేమాయణం నడుస్తున్న విషయం విధితమే. అయితే త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా మ్యాచ్‌లకు తుది జట్టులో భజ్జీకి చోటు లభిస్తే పెళ్లి తేదీ మారే అవకాశం ఉంది.

ఇంతరవకు బహిరంగంగా ఎప్పుడూ తమ ప్రేమ గురించి వారిద్దరూ చెప్పలేదు. ప్రస్తుతం శ్రీలంకలో టూర్‌లో ఉన్న భజ్జీ తిరిగిరాగానే వివాహ వేడుకలు, ఆహ్వానాల విషయాలకు సంబంధించి ఓ నిర్ణయానికి వస్తారని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
35ఏళ్ల హార్భజన్ సింగ్ భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం శ్రీలంకలో ఉన్నాడు. గల్లెలో జరిగిన తొలి టెస్టులో భజ్జీ తుది జట్టులో ఉన్నప్పటికీ, ఆగస్టు 20 నుంచి ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో భజ్జీకి విశ్రాంతినిచ్చారు.