Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తమిళ సినిమాతో హర్భజన్ అరంగేట్రం.. పోస్టర్‌ విడుదల!!

Harbhajan Singh to Make Acting Debut with Tamil Film Friendship, See Poster

ముంబై: భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు మైదానంలో సందడి చేసిన హర్భజన్ త్వరలో వెండితెరపై మెరవనున్నారు. ఓ తమిళ సినిమాతో భజ్జీ హీరోగా అరంగేట్రం చేయనున్నారు. ఆ సినిమాకు 'ఫ్రెండ్‌షిప్' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఆ సినిమా పోస్టర్‌ను హర్భజన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

'ఫ్రెండ్‌షిప్' సినిమా పోస్టర్‌

'ఫ్రెండ్‌షిప్' సినిమా పోస్టర్‌

'ఒక భారతీయ సినిమాలో మొట్ట మొదటిసారిగా ఓ క్రికెట్ దిగ్గజం ప్రధాన పాత్రలో కనిపించనున్నారు' అని భజ్జీ పోస్ట్ చేసిన పోస్టరులో రాసి ఉంది. ఆ పోస్టర్‌లో ఇద్దరు వ్యక్తుల చేతులు బేడీలతో ఉన్నాయి. ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా కూడా ఈ పోస్టర్ షేర్ చేసి ఓ ట్వీట్ చేసారు. జాన్ పాల్ రాజ్, షామ్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది థియేటర్లలోకి రానుంది. జేపీఆర్ స్టాలిన్ 'ఫ్రెండ్‌షిప్' సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం పూర్తి తారాగణం ఇంకా ప్రకటించబడలేదు.

గీతా చిత్రంలో భజ్జీ గెస్ట్ రోల్

గీతా చిత్రంలో భజ్జీ గెస్ట్ రోల్

పంజాబీ, బాలీవుడ్ సినిమాల్లో నటించిన గీతా బస్రాను హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గీతా నటించిన 'సెకండ్ హ్యాండ్ హస్బెండ్' చిత్రంలో భజ్జీ గెస్ట్ రోల్ చేసారు. పలు రియాలిటీ టీవీ షోలలో కూడా భజ్జీ పాల్గొన్నారు. భార్య గీతా ప్రోద్భలంతోనే భజ్జీ సినిమాల్లో కనిపించేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం తెలుస్తోంది. గ్రౌండ్‌లో వికెట్లు తీసిన హర్భజన్.. థియేటర్స్‌లో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.

భారత్ తరఫున హర్భజన్‌ 711 వికెట్లు

భారత్ తరఫున హర్భజన్‌ 711 వికెట్లు

తమిళ స్టార్ కమెడియన్ సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్న 'డిక్కీలోనా' సినిమాతో హర్భజన్ వెండితెరపై అరంగేట్రం చెయ్యనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. భారత్ తరఫున హర్భజన్‌ 711 వికెట్లు పడగొట్టారు. 103 టెస్టుల్లో 417, 236 వన్డేల్లో 269, 28 టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టారు. హర్భజన్ సింగ్ చివరిసారిగా 2016లో టీమిండియాకు ఆడారు.

విక్రమ్‌ సినిమాలో పఠాన్‌

భారత మాజీ పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నారు. తమిళ 'చియాన్‌' విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ నటించబోతున్నారు. తమిళ యువ డైరెక్టర్ అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ నటించనున్నారు. విక్రమ్ చిత్రానికి తాత్కాలికంగా "విక్రమ్ 58" అని పేరు పెట్టారు. ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. టర్కీకి చెందిన పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్‌ కనిపించనున్నారని సమాచారం.

Story first published: Monday, February 3, 2020, 14:05 [IST]
Other articles published on Feb 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+