న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ట్వీట్‌కు హర్భజన్ రిప్లై.. ట్రోల్ చేస్తున్న అభిమానులు

IPL 2019 : Harbhajan Singh Controversial Message On Virat Kohli || Oneindia Telugu
Harbhajan Singh Takes a Sly Dig at Virat Kohli’s Post on Humility, Gets Trolled by Virat Fans

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్‌కు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిప్లై ఇచ్చి అభిమానుల ట్రోలింగ్‌కు బలయ్యాడు. విరాట్ కోహ్లీ టీమిండియా నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌లలో ఒకడు. కోహ్లీ కెరీర్ ఆరంభం నుండి ఫామ్‌తో సంబంధం లేకుండా ఏ ఫార్మాట్ అయినా పరుగుల వరద పారిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది కోహ్లీ ఆటకు ఫిదా అయి అతనికి వీరాభిమానులుగా మారారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

చాలా చాలా నేర్చుకో:

ఇక ఐపీఎల్-12 నుండి బెంగళూరు నిష్క్రమించడంతో కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఫొటో పోస్ట్ చేసాడు. 'నేర్చుకోవడానికి ప్రతి రోజు అవకాశం ఉంటుంది. వినయంగా ఉండు' అని రాసాడు. ఈ పోస్టుకు హర్భజన్ రిప్లై ఇచ్చాడు. 'ప్రతిరోజూ నీకు అవకాశం ఉంది. చాలా చాలా నేర్చుకో' అని హర్భజన్ ట్వీటాడు.

ఇక్కడ ఏదో కాలిపోతుంది:

ఇక్కడ ఏదో కాలిపోతుంది:

ఈ ట్వీట్ చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు ఊరుకుంటారా?. హర్భజన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 'అసూయ పరుడు' అని ఓ అభిమాని ట్రోల్ చేయగా.. 'ఇతరులపై అసూయ పడకు' అని మరో అభిమాని ట్రోల్ చేసాడు. 'ఓ మ్యాన్.. ఇక్కడ ఏదో కాలిపోతుంది', 'అసూయ పడుతుండు' అని రకరకాలుగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

గంభీర్‌కు భజ్జీ మద్దతు:

గంభీర్‌కు భజ్జీ మద్దతు:

క్రికెటర్ నుంచి పొలిటీషియన్‌గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన గౌతమ్ గంభీర్ 2019 సాధారణ ఎన్నికల్లో ఢిల్లీ తూర్పు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌, తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆతిషీపై అశ్లీల క‌ర‌ప‌త్రాల‌ను గంభీర్ విడుదల చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. గంభీరే స్వ‌యంగా ఆ ప‌త్రాల‌ను పంచారంటూ గురువారం ఆమ్ ఆద్మీ(ఆప్) నేత‌లు గురువారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలు చేశారు.

హ‌ర్భ‌జ‌న్ సింగ్

హ‌ర్భ‌జ‌న్ సింగ్

గంభీర్‌పై వచ్చిన ఆరోపణలపై హ‌ర్భ‌జ‌న్ సింగ్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. 'గంభీర్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు విని షాక‌య్యాను, అత‌ని గురించి నాకు బాగా తెలుసు, మ‌హిళ‌ల ప‌ట్ల అత‌ను అలాంటి నీచ వ్యాఖ్య‌లు చేయ‌డు, అత‌ను ఎన్నిక‌ల్లో గెలుస్తాడా లేదా అన్నది అప్ర‌స్తుతం, కానీ అత‌ను మంచి వ్య‌క్తి' అని భజ్జీ ట్వీట్ చేశాడు.

Story first published: Friday, May 10, 2019, 16:39 [IST]
Other articles published on May 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X