ఫతుల్లా: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో పాకిస్ధానీ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రం రికార్డుని అధిగమించాడు.
ఫతుల్లాలోని ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో హార్భజన్ సింగ్ 415వ వికెట్‌ను తీసుకున్నాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ఇమ్రుల్ కయాస్‌ను వికెట్ కీపర్ వర్ధమాన్ సాహా స్టంప్ ఔట్ చేయడంతో ఈ ఘనతను సాధించాడు.
దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్స్ జాబితాలో వసీం అక్రంను వెనక్కి నెట్టి 9వ స్ధానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్లో నాల్గవ రోజు మొమిల్ హాక్ వికెట్ తీసుకుని వసీం అక్రం రికార్డుని సమం చేసిన సంగతి తెలిసిందే.

800 వికెట్లు తీసుకుని టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడిగా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న భజ్జీ 102 టెస్టుల్లో 415 వికెట్లు తీసుకున్నాడు.
34 ఏళ్ల హార్భజన్ సింగ్ 1998లో బెంగుళూరులో ఆస్టేలియాపై జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. టీమిండియా తరుపున 229 వన్డేలు, 25 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడాడు.
టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న అటగాళ్లు:
1. Muttaiah Muralitharan (Sri Lanka) - 800 (133 matches)
2. Shane Warne (Australia) - 708 (145)
3. Anil Kumble (India) - 619 (132)
4. Glenn McGrath (Australia) - 563 (124)
5. Courtney Walsh (West Indies) - 519 (132)
6. Kapil Dev (India) - 434 (131)
7. Richard Hadlee (New Zealand) - 431 (86)
8. Shaun Pollock (South Africa) - 421 (108)
9. Harbhajan Singh (India) - 415 (102)
10. Wasim Akram - 414 (104)