Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భజ్జీ గుర్తుకు వస్తే ఇప్పటికీ నిద్ర పట్టదు: పాంటింగ్

ఢిల్లీ: భారత ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ గుర్తుకు వస్తే తనకు ఇప్పటికీ ఆందోళన చెందుతానని, అతనే తన నెంబర్ వన్ శత్రువు అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ చెప్పాడు. రికీ పాంటింగ్ బ్యాట్‌తో పాటు మైదానంలో నోటితోను ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసేవాడు.

అలాంటి రికీ పాంటింగ్‌కు భజ్జీ చుక్కలు చూపించాడు. 2012లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాంటింగ్‌ ఇటీవల మాట్లాడుతూ... హర్భజన్‌ సింగ్‌ క్రికెట్‌లో తన బద్ధశత్రువు అని, పదునైన అతని బౌలింగ్‌లో ఆడేందుకు నేను చాలా శ్రమించాల్సి వచ్చేదని చెప్పాడు.

Harbhajan Singh still gives me nightmares: Ricky Ponting

ఇప్పటికీ అతను గుర్తుకు వస్తే తనకు నిద్రలేని రాత్రులేనని చెప్పాడు. అప్పట్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ సైమండ్స్‌ - హర్భజన్‌ మధ్య చెలరేగిన 'మంకీగేట్‌' వివాదం కూడా క్రికెట్‌ ప్రపంచంలో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే.

కాగా, రికీ పాంటింగ్ 168 టెస్టుల్లో 41 శతకాలు, 375 వన్డేల్లో 30 శతకాలు చేశాడు. 1995లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పాంటింగ్‌ దాదాపు 17 ఏళ్ల కెరీర్‌లో చాలామంది అగ్రశ్రేణి బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. కానీ భజ్జీ అంటే మాత్రం దడదడలాడేవాడినని చెప్పడం గమనార్హం.

1996-2010 మధ్య ఆరు సార్లు భారత్‌ పర్యటనకు రికీ పాంటింగ్‌ వస్తే 25 ఇన్నింగ్స్‌ల్లో అతను చేసిన పరుగులు 662. సెంచరీ ఒక్కటే. ఒకానొకదశలో 14 టెస్టుల్లోనే రికీ పాంటింగ్‌ను ఏకంగా 10సార్లు హర్బజన్ సింగ్ ఔట్‌ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+