For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెంపదెబ్బ నుంచి మంకీ గేట్ దాకా, శ్రీశాంత్ డ్రామా: తప్పుచేశానన్న భజ్జీ

ముంబై: హర్బజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మంకీ గేట్, శ్రీశాంత్ పైన చేయి చేసుకున్న ఘటన, డారెన్ లెహమాన్‌తో వాగ్వాదం, అనిల్ కుంబ్లే హెడ్‌కోచ్‌గా నియమితులు కావడం.. తదితర అంశాల పైన స్పందించాడు.

ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గతంలో శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టడం తాను చేసిన పెద్ద తప్పెనని భజ్జీ చెప్పాడు. ఆ తప్పుకు నేను ఇప్పటికీ సిగ్గుపడుతున్నానని, క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు. అదే సమయంలో, ఏడుపుతో శ్రీశాంత్ నాటకాన్ని బాగా రక్తి కట్టించాడని అన్నాడు.

తాను గట్టిగా కొట్టేసినట్టు ఏడుపు లంఘించుకున్నాడన్నాడు. ఆస్ట్రేలియాతో పోరులో తాను ఆడుతుంటే పదే పదే స్లెడ్జింగ్ చేస్తున్న డారెన్ లీమన్‌ను హేళన చేశానని, అతనికి ఉన్న పెద్ద పొట్టను చూపిస్తూ.. గర్భం దాల్చావా అని అడిగానని చెప్పాడు.

 Harbhajan Singh speaks on Virat Kohli, 'monkeygate' and why he slapped S Sreesanth

ఓసారి నేను బ్యాటింగ్‌ చేస్తుండగా.. డారెన్‌ లీమన్‌ అదే పనిగా మాటల దాడి చేస్తూ ఉన్నాడని, అతడికి భారీ పొట్ట ఉంటుందని, దాని వైపు చూపిస్తూ.. 'నువ్వు గర్భం దాల్చావా' అన్నానని, ఈ విషయం లీమన్‌.. షేన్‌ వార్న్‌కు చెబితే అతను పగలబడి నవ్వాడని భజ్జీ చెప్పాడు.

తర్వాత షేన్ వార్న్‌ తన దగ్గరికి వచ్చి ఈ విషయం అడిగితే.. సాధారణంగా ఆటగాళ్లకు అంతేసి పొట్టలుండవని చెప్పానని, ఆస్ట్రేలియాకే చెందిన మెక్‌గ్రాత్‌ కూడా తనను చాలాసార్లు మాటలతో కవ్వించాడని, గొప్ప పేరున్న బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేస్తున్నాడు ఎవరితను... అన్నట్లు తనను ఉద్దేశించి ఓసారి మాట్లాడాడనని, దానికి గట్టిగా బదులిచ్చా చెప్పాడు.

తనను ఒక మాటంటే ఎదురు తిరిగి రెండు మాటలు అంటానని, అందువల్లే ఆస్ట్రేలియా క్రికెటర్లకు తానంటే భయమని చెప్పుకొచ్చాడు. ఓ దశ దాటాక ఆస్ట్రేలియా ఆటగాళ్లు నన్ను కవ్వించడం మానేసారని చెప్పాడు. సైమండ్స్‌తో గొడవ విషయానికి వస్తే అతణ్ని నేను మంకీ అనలేదని, మీ అమ్మచేతి రొట్టెలు తినాలనుందని మాత్రమే వ్యాఖ్యానించానని, అయితే, అతను ఇదంతా వినలేదని, ఎందుకంటే సైమండ్స్‌కు హిందీ తెలియదని, తనకు ఇంగ్లిష్‌ రాదని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+