Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్ట్ క్రికెట్‌ను ఖూనీ చేస్తున్నారు.. స్టార్ క్రికెటర్ సంచలనం!

Harbhajan Singh: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఎదుర్కొన్న పరాజయంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 93 పరుగులకే కుప్పకూలడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇలాంటి ర్యాంక్ టర్నర్లను తయారు చేస్తూ టెస్ట్ క్రికెట్‌ను పూర్తిగా నాశనం చేస్తున్నారని జట్టు యాజమాన్యంపై మండిపడ్డారు.

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఓటమి అనంతరం తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన హర్భజన్ సింగ్.. "టెస్ట్ క్రికెట్‌కు RIP (రెస్ట్ ఇన్ పీస్). వారు ఈ ఫార్మాట్‌ను పూర్తిగా నాశనం చేశారు. కొన్నేళ్లుగా ఇలాంటి పిచ్‌లు తయారు చేస్తున్నారు. జట్టు గెలుస్తోంది కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు" అని ఆరోపించారు.

Harbhajan Singh Slams Rank Turners Killing Test Cricket

ఆటగాళ్ల నైపుణ్యం పెరగదు..
ఇలాంటి పిచ్‌లపై ఆడటం వల్ల ఆటగాళ్లు ఏ మాత్రం ఎదగరని హర్భజన్ అభిప్రాయపడ్డారు. మీరు గానుగెద్దులా ఒకేచోట తిరుగుతున్నారే తప్ప ముందుకు వెళ్లడం లేదని భజ్జీ మండిపడ్డారు. బ్యాటర్లకు పరుగులు ఎలా చేయాలో కూడా తెలియని విధంగా పిచ్‌లను తయారుచేస్తున్నారని అన్నారు. నైపుణ్యంతో కాకుండా పిచ్ వల్లే వికెట్లు పడుతుంటే.. సమర్థుడైన బౌలర్‌కు, బ్యాటర్‌కు తేడా ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.తొలి టెస్టులో రెండో రోజే 15 వికెట్లు పడటం, మూడో రోజు రెండు సెషన్లలోపే మ్యాచ్ ముగియడంతో పిచ్‌పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై దుమారం
అయితే మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. తమకు కావాలనే ఇలాంటి పిచ్‌ను సిద్ధం చేసుకున్నామని అంగీకరించడం గమనార్హం. గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు మరింత దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి పిచ్‌లపై ఆడటం వల్ల ఆటగాళ్ల నైపుణ్యం పెరగదని హర్భజన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

Story first published: Tuesday, November 18, 2025, 11:00 [IST]
Other articles published on Nov 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+