అరుదైన సన్నివేశం: భార్యకు, కూతురికి భజ్జీ అభివాదం
హైదరాబాద్: ఐపీఎల్‌లో బుధవారం వారం రాత్రి ముంబై ఇండియన్స్‌కు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో ఒకడైన హర్భజన్ సింగ్ గ్యాలరీలో ఉన్న తన భార్యకు, కూతురికి మైదానం నుంచి చేతులు ఊపుతూ అభివాదం చేశాడు.
గ్యాలరీలో ఉన్న హర్భజన్ భార్య గీతా బస్రా, కూతురు హినయ కూడా చేతులు ఊపారు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో హర్భజన్‌కు భార్య నుంచి ఉన్న మద్దతు చూసి అభిమానులు సైతం మురిసిపోయారు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 10వ సీజన్‌లో ముంబైకి ఇది రెండో వరుస విజయం. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 159 పరుగుల విజయ లక్ష్యాన్ని నితీశ్ రాణా(36 బంతుల్లో 45: 3 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది.
పార్దీవ్ పటేల్ 39, కృనాల్ పాండ్యా 37 మెరుగైన ప్రదర్శన చేయడంతో 8 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయాన్ని సాధించింది. లక్ష్యం తక్కువగా ఉండటంతో ముంబై బ్యాట్స్‌మెన్లు నిలకడగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. మరోవైపు సన్‌రైజర్స్ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీయలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications