చెన్నై జట్టుతో రవిచంద్రన్ అశ్విన్ గొడవ!
IPL 2025 Chennai Super Kings: ఐపీఎల్-2025లో పేలవ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. ఆటగాళ్ల చెత్త ప్రదర్శనతో, వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలను మూట గట్టుకుంది. అయితే తాజాగా రవిచంద్రన్ అశ్విన్ విషయంలో సీఎస్కేపై తీవ్రంగా విమర్శలు గుప్పించడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్. అశ్విన్ ను ఆ జట్టు ఎందుకు పక్కన పెట్టి ఉంటుందో వివరించాడు. అలాగే అశ్విన్ కు.. ఆ జట్టులో ఎవరితోనే గొడవ అయిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
బెంచ్ లో కూర్చోపెట్టడానికి రూ.10 కోట్లు ఇచ్చారా?
చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచును పంజాబ్ కింగ్స్ పై ఆడి.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచులో రవిచంద్రన్ అశ్విన్‌ను (Ravichandran Ashwin) ఎందుకు ఆడించలేదని ప్రశ్నించాడు భజ్జీ. అతడిని ఆడించకుండా తప్పు చేశారని అన్నాడు. ''పరిస్థితులకు తగ్గట్లుగా చెన్నై తమ జట్టును ఎప్పుడూ ఎంపిక చేయదు. నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా.. ఈ ముగ్గురిని కలిపి పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో ఆడిస్తే సీఎస్కే కచ్చితంగా గెలిచేది. అయినా అతడికి రూ. 10 కోట్లు చెల్లించేది, బయట కూర్చోపెట్టడానికి కాదు కదా. అసలు అతడికి ఆడేందుకు అవకాశం ఇవ్వకుండా బెంచ్ కే ఎందుకు పరిమితం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసి అతడు ఎవరితోనైనా గొడవపడ్డాడేమో!'' అని హర్భజన్ సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

పీకింది ఏమీ లేదు..
అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యజమాన్యం.. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతడిపై సీఎస్కే అభిమానుల్లోనూ భారీ అంచనాలు పెరిగాయి. కానీ అతడు మాత్రం చెత్త ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాడు. ఆడించిన 7 మ్యాచుల్లో దారుణంగా ఆడాడు. ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతడిని మూడు మ్యాచుల్లో పక్కనపెట్టేసింది సీఎస్కే. ఈ క్రమంలోనే ఇప్పుడు హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications