Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిగతా కుర్రాళతో పోలిస్తే గిల్ డిఫరెంట్: హర్భజన్ సింగ్

ఈ ఏడాది మంచి ఫామ్ కనబరిచిన టీమిండియా ప్లేయర్లలో యంగ్ స్టార్ శుభ్‌మన్ గిల్ ఒకడు. డబ్ల్యూటీసీ ఫైనల్, విండీస్‌తో తొలి టెస్టు మినహా మిగతా అన్ని సిరీసుల్లో గిల్ రాణించాడు. ఈ ఏడాదిలో మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే వన్డే వరల్డ్ కప్‌లో అతని ఆటతీరు భారత్‌కు కీలకం కానుంది.

ఇదే విషయాన్ని టీమిండియా మాజీ లెజెండ్ హర్భజన్ సింగ్ కూడా నొక్కిచెప్పాడు. మిగతా కుర్రాళ్లతో పోలిస్తే గిల్ డిఫరెంట్ అని, పరుగులు చేయాలనే ఆకలే అతన్ని మిగతా వాళ్ల నుంచి వేరు చేస్తుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. 2019లో టీమిండియా అరంగేట్రం చేసిన తర్వాత ఒక్కోమెట్టే ఎక్కుతూ.. ఇప్పుడు జట్టులో కీలకమైన ఆటగాడిగా గిల్ మారిన సంగతి తెలిసిందే. తాజాగా వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా సాధించాడీ పంజాబ్ కుర్రాడు.

Harbhajan Singh Shubman Gill

'తన ఆటపై గిల్‌కు చాలా ప్యాషన్ ఉంది. అతని ఆకలే మిగతా వారి నుంచి గిల్‌ను వేరు చేస్తుంది. తను ఏదో చేయాలనే కోరిక, చేస్తాననే నమ్మకం రెండూ అతనిలో ఉన్నాయి' అని భజ్జీ మెచ్చుకున్నాడు. గిల్‌ కోసం వాళ్ల నాన్న పడిన కష్టానికి న్యాయం చేయాలంటే.. అతను టీమిండియాకు కనీసం 15-20 ఏళ్లు ఆడాలని భజ్జీ చెప్పాడు. గిల్ గురించి తనకు చాలా తక్కువే తెలిసినా.. అతని ట్యాలెంట్, మైండ్ సెట్ చూస్తేనే చాలా గొప్ప ప్లేయర్ అని అర్థమవుతుందన్నాడు.

గిల్ బ్యాటింగ్ చేస్తుంటే చూడటం చాలా సంతోషాన్నిస్తుందని హర్భజన్ చెప్పాడు. పంజాబ్‌ల ఫజిల్కా అనే గ్రామంలో గిల్ పుట్టాడు. వాళ్ల నాన్న కూడా క్రికెట్ కోచే. కొడుకులో ట్యాలెంట్ చూసిన ఆయన.. గిల్ కోసం కుటుంబాన్ని మొహాలీ షిఫ్ట్ చేశాడు. అక్కడ ఎన్నో కష్టాలు పడినా.. కొడుకు మాత్రం ఆటలో ఎదగడానికి ప్రోత్సాహం ఇచ్చాడు.

'టీమిండియా తరఫున గిల్ చాలా ఏళ్లు ఆడాలని, ఒకరోజు జట్టుకు నాయకత్వం కూడా వహించాలని కోరుకుంటున్నా. అప్పుడే వాళ్ల నాన్న సంతృప్తి చెందుతాడు. ఆ సంతోషం కేవలం ఆయనదే కాదు. మా పంజాబ్‌ది కూడా. ఎందుకంటే గిల్ మా పంజాబ్ బిడ్డ' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, July 18, 2023, 18:46 [IST]
Other articles published on Jul 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+