రోహిత్ బ్యాటింగ్‌పై భజ్జీ ఆందోళన.. సెమీస్‌కి చేరిన టీమిండియాకు కీలక సూచన

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించి గ్రూప్-2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ మాత్రం క్రీడాభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చెప్పాడు.

టీ20 ప్రపంచకప్‌లో భారత్ జర్నీ..
తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించిన ఆ జట్టు కేవలం సౌతాఫ్రికా చేతిలో మాత్రమే ఓటమి చవిచూసింది. మిగతా మ్యాచుల్లో అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై కూడా ఘనవిజయం సాధించింది. దీంతో మొత్తం 8 పాయింట్లతో గ్రూప్-2 టాపర్‌గా సెమీస్ చేరింది. గురువారం నాడు తేదీన అడిలైడ్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అవుతోంది.

రోహిత్ బ్యాటింగ్‌పై ఆందోళన
భారత జట్టు సెమీఫైనల్ చేరినప్పటికీ.. టీమిండియా సారధి, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో విఫలమవడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన రోహిత్.. నెదర్లాండ్స్‌పై హాఫ్ సెంచరీ చేసినా ధాటిగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత జింబాబ్వే, సౌతాఫ్రికా మ్యాచుల్లో చెరో 15 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై భజ్జీ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.

రెండు అడుగుల దూరంలో ట్రోఫీ..
సెమీఫైనల్‌లో రోహిత్ ఫామ్ అందుకుంటాడని జోస్యం చెప్పిన భజ్జీ.. ట్రోఫీకి భారత జట్టు కేవలం రెండడుగుల దూరంలోనే ఉందన్నాడు. సూర్యకుమార్, అర్షదీప్ అద్భుతంగా రాణిస్తున్నారని, మిగతా ఆటగాళ్లు కూడా రాణిస్తే ట్రోఫీ మనదేనని భజ్జీ చెప్పాడు. ఒత్తిడిని అధిగమించే జట్టే ట్రోఫీ ముద్దాడుతుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కప్పు కొట్టేందుకు ఈ జట్టు సరైందని, ట్రోఫీకి రెండు అడుగుల దూరంలో జట్టు ఒత్తిడికి తలవంచ కూడదని సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications