Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harbhajan Singh: మెగా వేలంలో ఇషాన్ కిష‌న్‌ను ఆర్సీబీ కొనుగోలు.. ఆ జ‌ట్టు కెప్టెన్ అత‌డే!

Harbhajan Singh says RCB will target Ishan Kishan in IPL 2022 mega auction

ఐపీఎల్ 2022 మెగా వేలానికి మ‌రొక రోజు మాత్ర‌మే స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయ‌బోయే ఆట‌గాళ్ల‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మెగా వేలంలో టీమిండియా యువ బ్యాట‌ర్‌ ఇషాన్ కిష‌న్‌ను కొనుగోలు చేయడానికి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు క‌చ్చితంగా ప్ర‌యత్నిస్తుంద‌ని ఆయ‌న‌ చెప్పుకొచ్చాడు.

ఇషాన్ కిష‌న్‌ను కెప్టెన్ చేయాలి

ఇషాన్ కిష‌న్‌ను కెప్టెన్ చేయాలి

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇషాన్ కిష‌న్‌ను ఆర్సీబీ ల‌క్ష్యంగా చేసుకుంటుంద‌ని భ‌జ్జీ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఎంత ధ‌ర వెచ్చించైనా స‌రే ఈ యువ క్రికెట‌ర్‌ను బెంగ‌ళూరు కొనుగోలు చేస్తుంద‌ని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను ఇషాన్ కిష‌న్‌కు అప్ప‌గించాల‌ని భ‌జ్జీ సూచించాడు. కాగా ఐపీఎల్‌లో గ‌తేడాది వ‌ర‌కు ఇషాన్ కిష‌న్ ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడాడు. కానీ ఈ సారి ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ జాబితాలో కిష‌న్‌కు చోటు ద‌క్క‌లేదు. దీంతో మెగా వేలంలో పాల్గొంటున్నాడు. వేలంలో ఇషాన్ కిష‌న్ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు.

ఇషాన్ కిష‌న్ కోసం చాలా జ‌ట్లు పోటీ

ఇషాన్ కిష‌న్ కోసం చాలా జ‌ట్లు పోటీ

"నేను ఇషాన్ కిషన్ అభిమానిని. ఇషాన్‌ తన సొంత సామర్థ్యంతో 30 బంతుల్లోనే 70-80 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించ‌గ‌ల‌డు. అతను చాలా పెద్ద ఆటగాడు అవుతాడు. ఇషాన్ కిష‌న్ లాంటి ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి. వయసు పెర‌గ‌డం, బాధ్యతలతో మరింత పెద్దవాడు అవుతాడు. ఇప్పటికే జార్ఖండ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. మెగా వేలంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కచ్చితంగా ఇషాన్ కిషన్‌ను టార్గెట్ చేస్తుంది. వేలంలో చాలా జట్లు ఇషాన్ కిష‌న్ కోసం పోటీ ప‌డ‌తాయి" అని హర్భజన్ సింగ్‌ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు.

అరుదైన ఆట‌గాడు

అరుదైన ఆట‌గాడు

ఇక టీమిండియా వెట‌ర‌న్ వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ కూడా ఇషాన్ కిష‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

ఇషాన్‌కున్న సామ‌ర్థ్యం అరుదైన ఆట‌గాళ్ల‌ల్లో మాత్ర‌మే ఉంటుంద‌ని కొనియాడాడు. ఇషాన్ అద్భుత‌మైన నైపుణ్యాల‌ను క‌ల్గి ఉన్నాడ‌ని చెప్పుకొచ్చాడు. మల్టీ-నేషన్ టోర్నమెంట్‌లలో ఇషాన్ కిష‌న్‌ను చాలా బాగా ఆడాడ‌ని అన్నాడు. మంచి నైపుణ్యంతో నిల‌క‌డ‌గా ఆడుతున్నాడ‌ని దినేష్ కార్తీక్ చెప్పాడు.

 రిటెన్ష‌న్ జాబితాలో ద‌క్క‌ని చోటు

రిటెన్ష‌న్ జాబితాలో ద‌క్క‌ని చోటు

ఐపీఎల్ ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియన్స్ త‌ర‌ఫున ఆడిన ఇషాన్ కిష‌న్‌కు ఈ సారి ఆ జ‌ట్టు రిటెన్ష‌న్ జాబితాలో చోటు ద‌క్క‌లేదు. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై రిటైన్ చేసుకుంది. దీంతో ఈ శ‌నివారం, ఆదివారం జ‌ర‌గ‌నున్న మెగా వేలంలో ఇషాన్ కిష‌న్ పాల్గొన‌నున్నాడు. వేలంలో కిష‌న్ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ప్రైజ్‌తో ఉన్నాడు. ఐపీఎల్ ఇప్ప‌టివ‌ర‌కు కిష‌న్‌ 130కి పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.

Story first published: Friday, February 11, 2022, 14:10 [IST]
Other articles published on Feb 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+