Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విమానంలో బ్యాట్‌ చోరీ.. షాక్ తిన్న హర్బజన్‌ సింగ్‌!!

Harbhajan Singh says My bat is missing, but can’t say it has been stolen
Harbhajan Singh Loses His IPL Bat While Traveling In Flight | Oneindia Telugu

చెన్నై: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్బజన్‌ సింగ్‌ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13 కోసం సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ ప్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున హర్బజన్‌ ఆడనున్నాడు. ప్రాక్టీస్ కోసం శనివారం ముంబై నుంచి ఇండిగో విమానంలో కోయంబత్తూర్‌కు విమాన ప్రయాణం చేసాడు. కోయంబత్తూర్‌ చేరుకున్నాక భజ్జి తన కిట్‌ బ్యాగ్‌ను పరిశీలించగా.. అందులోని క్రికెట్‌ బ్యాట్‌ మాయమైంది. వెంటనే అతను తన ట్విట్టర్‌ ద్వారా విమాన సంస్థకు ఫిర్యాదు చేశాడు.

నాకు సహాయం చేయండి:

నాకు సహాయం చేయండి:

'నేను నిన్న ముంబై నుండి కోయంబత్తూరుకు 'ఇండిగో 6 ఇ 6313' ఫ్లైట్ నంబర్‌లో ప్రయాణించాను. నా కిట్ బ్యాగ్ నుండి ఒక బ్యాట్ మాయం అయిందని తెలుసుకున్నా. ఈ నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఒకరి వస్తువులు తీసుకోవడం దొంగతనం అవుతుంది. నాకు సహాయం చేయండి' అని ట్విట్టర్ వేదికగా హర్బజన్‌ విమాన సంస్థకు ఫిర్యాదు చేసాడు. 'ఈ విషయంలో మమ్మల్ని క్షమించండి మిస్టర్ సింగ్. వెంటనే తనిఖీ చేస్తాం. మీ బ్యాట్‌ను అప్పగిస్తాం' అని విమాన సంస్థ అధికారి రిప్లై ఇచ్చారు.

 దొంగిలించబడిందని చెప్పలేను:

దొంగిలించబడిందని చెప్పలేను:

'మేము కోయంబత్తూరులో దిగిన వెంటనే నా కిట్ పరిశీలించాను. అందులో నా బ్యాట్ లేదు. నా బ్యాట్ ఏమైందో అర్ధం కాలేదు. అయితే దొంగిలించబడిందని మాత్రం నేను చెప్పలేను' అని హర్బజన్‌ సింగ్‌ మీడియాతో అన్నాడు. 'ప్రాక్టీస్ తర్వాత నా కిట్ బ్యాగ్ తెరవలేదు. అదనపు సామాను కలిగి ఉన్నారు కాబట్టి 1,200 రూపాయలు చెల్లంచాలని విమానాశ్రయంలోని అధికారులు అడిగారు. కానీ.. మేము అప్పటికే అదనపు సామాను ప్యాకేజీని కలిగి ఉన్నందున మా బృందం ఆ మొత్తాన్ని చెల్లించలేదు' అని భజ్జి పేర్కొన్నాడు.

 ఇండిగో అధికారులకు ఫిర్యాదు:

ఇండిగో అధికారులకు ఫిర్యాదు:

'సదరు బ్యాట్ సామాను విషయానికి సంబంధించినదా కాదా అని నాకు తెలియదు. బ్యాట్ మాత్రం నాకు చాలా ముఖ్యం. ప్రస్తుతం నేను ఐపీఎల్‌ కోసం సిద్దమవుతున్నా. నేను చివరిసారిగా జుహులో ప్రాక్టీస్ సెషన్‌లో ఆ బ్యాట్‌ను ఉపయోగించాను. బ్యాట్ నాకు ముఖ్యం కాబట్టి నేను ఇండిగో అధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయాన్ని పరిశీలిస్తాం అని వారు నాకు చెప్పారు. నా బ్యాట్ తిరిగి నాకు ఇస్తారని నేను నమ్ముతున్నా' అని హర్బజన్‌ సింగ్‌ మీడియాతో చెప్పాడు.

 ఆల్‌టైమ్‌ అత్యుత్తమ టెస్టు జట్టు:

ఆల్‌టైమ్‌ అత్యుత్తమ టెస్టు జట్టు:

తాజాగా హర్భజన్‌ సింగ్‌ తన ఆల్‌టైమ్‌ అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హర్భజన్‌ సింగ్‌ తన టెస్టు జట్టులో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలకు అవకాశం ఇవ్వలేదు. తన టెస్టు ఎలెవన్‌లో ప్రధానంగా అంతర్జాతీయ కెరీర్‌లో తనతో పాటు ఆడిన క్రికెటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక భజ్జీ తన టెస్టు ఎలెవన్‌లో ముగ్గురు భారత క్రికెటర్లకు మాత్రమే చోటు కల్పించాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, ద వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌, డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లకు చోటిచ్చాడు.

Story first published: Monday, March 9, 2020, 11:02 [IST]
Other articles published on Mar 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+