అంబటి రాయుడికి అన్యాయం చేశారు: హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ: తెలుగు తేజం, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడిపై ఆ జట్టు సహచర ఆటగాడు, భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ఆరంభ మ్యాచ్‌తోనే రాయుడు తానేంటో నిరూపించుకున్నాడని కొనియాడు. తద్వార గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ జట్టుకు తానెంత అర్హుడనే విషయాన్ని చాటుకున్నాడని ఈ సీనియర్ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. అపార ప్రతిభ కలిగిన రాయుడిని ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకుండా అతనికి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో రాయుడు(71) సూపర్ బ్యాటింగ్‌తో రాణించడంతో చెన్నై 5 వికెట్లతో అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రాయుడు తన అనుభవపూర్వకమైన ఆటతో విజయా తీరాలకు తీర్చాడు. దీంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఈ తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పోర్ట్స్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ రాయుడి ఆటను మెచ్చుకున్నాడు.

 అంబటికి అన్యాయం చేశారు..

అంబటికి అన్యాయం చేశారు..

‘2019 వన్డే ప్రపంచకప్‌లో రాయుడిని ఎంపిక చేయకుండా అతనికి అన్యాయం చేశారు. ఇప్పుడు అతని ఆటను ఎంత కొనియాడిన తక్కువే. 2019 ప్రపంచకప్ జట్టులో రాయుడు ఉండాల్సింది. కానీ ఐపీఎల్ 2020 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌తోనే తానేంటో నిరూపించుకున్నాడు. తన సత్తా ఏంటో తెలియజేశాడు. వయసే కాకుండా ప్రతిభను కూడా పరిగణించాలని చాటి చెప్పాడు.'అని భజ్జీ కొనియాడు.

బౌలింగ్ అద్భుతం..

బౌలింగ్ అద్భుతం..

ఇక ముంబైతో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో తమ జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారని భజ్జీ కొనియాడాడు. ముఖ్యంగా పియూష్ చావ్లా ఆకట్టుకున్నాడని తెలిపాడు. ‘నేను బౌలింగ్ అటాక్‌ను కూడా ప్రశంసించాలనుకుంటున్నా. ఎందుకంటే బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా పియూష్ చావ్లా ఆకట్టుకున్నాడు. పరుగులను కట్టడి చేయడంతో పాటు రోహిత్ శర్మ వికెట్ తీశాడు. ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై 162 పరుగులకే పరిమితమైంది'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

 ఆ లెక్కన చెన్నైదే టైటిల్..

ఆ లెక్కన చెన్నైదే టైటిల్..

తొలి మ్యాచ్‌లోనే తమ జట్టు విజయం సాధించిందని, దీన్ని ఇలాగే కొనసాగించాలని భజ్జీ ఆకాంక్షించాడు. రెండేళ్ల క్రితం (2018 సీజన్) కూడా చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిందని, ఆ సీజన్ ఫైనల్ చేరి టైటిల్ కూడా అందుకుందని గుర్తు చేశాడు. ఇదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందని, ఆ లెక్కన చెన్నై సూపర్ కింగ్స్‌దే టైటిలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

CSK VS MI : MSK Prasad, Kohli Slammed By Fans After Ambati Rayudu's Stunning Knock || Oneindia
త్రీడైమన్షన్ ఆటగాడంటూ...

త్రీడైమన్షన్ ఆటగాడంటూ...

ఇక 2019 ప్రపంచకప్‌ భారత జట్టులో కచ్చితంగా ఎంపిక అవుతానని ధీమాతో ఉన్న రాయుడికి ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ మొండి చేయి చూపించిన విషయం తెలిసిందే. త్రీడైమన్షన్ పేరిట రాయుడికి బదులు విజయ్‌శంకర్‌ను తీసుకోగా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. పైగా ధావన్‌ గాయపడినా అతడి స్థానంలో రిషభ్‌పంత్‌ను తీసుకున్నారు. దీంతో తీవ్ర నిరాశ చెందిన అంబటి రాయుడు వెంటనే రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇక నిన్నటి మ్యాచ్ పరిస్థితులు ఇంచుమించు 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్ మ్యాచ్‌ను తలపించడంతో భారత జట్టులో రాయుడు ఉంటే విజయం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

అంబటి రాయుడిని కించపర్చిన సంజయ్ మంజ్రేకర్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 20, 2020, 20:51 [IST]
Other articles published on Sep 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X