Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేనేమీ ఏడవలేదు: ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టులో లేకపోవడంపై భజ్జీ

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

తద్వారా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుని ఐపీఎల్ టైటిల్ మూడుసార్లు అందుకున్న తొలి జట్టుగా కొత్త చరిత్ర సృష్టించింది. అయితే ఐపీఎల్ పదో సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టులో చోటు దక్కకపోవడం తనను ఎంతమాత్రం నిరాశకు గురి చేయలేదని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు.

పైనల్‌లో తనకు అవకాశం దక్కుతుందని తొలుత భావించానని హర్భజన్ సింగ్ చెప్పాడు. 'ఫైనల్ మ్యాచ్‌లో నాకు ముంబై ఇండియన్స్ సెలక్టర్లు చోటు ఇవ్వకపోవడం నాకేమీ బాధ అనిపించలేదు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. నేను జట్టు మనిషిని' అని చెప్పుకొచ్చాడు.

Harbhajan Singh Says He Should Have Been Picked To Play IPL 2017 Final

'కొన్ని సాంకేతికపరమైన అంశాలు ముడిపడి ఉండటంతోనే లెగ్ స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె జట్టులో ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ ఉండటం వల్లే నాకు విశ్రాంతి ఇచ్చారు. ఈ విషయాన్ని ముంబై కోచ్ మహేలా జయవర్ధనే నాకు చెప్పాడు' అని అన్నాడు.

'గతేడాది మేనేజ్‌మెంట్ ఎంపిక చేసిన తుది జట్టులో తనకు చోటు కల్పించారు. అయితే ఈసారి తన కుటుంబంతో తగిన సమయాన్ని గడిపాను. అంతేతప్ప నాకు స్థానం దక్కనందుకు ఎటువంటి బాధలేదు. దానికోసం నేనేమీ ఏడవలేదు' అని భజ్జీ పేర్కొన్నాడు.

'మీరు తుది జట్టులో ఉంటానని భావించారా?' అన్న ప్రశ్నకు భజ్జీ పై విధంగా స్పందించాడు. ఏది అయితేనేం చివరకు ముంబై గెలిచిందని చెప్పుకొచ్చాడు. వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ మిమ్మల్ని అలాగే కొనసాగిస్తుందా? అన్న ప్రశ్నకు గాను తనకు ప్రాంఛైజీపై నమ్మకం ఉందని చెప్పాడు.

ముంబై ఇండియన్స్ తరుపున హర్భజన్ సింగ్ పదేళ్ల నుంచి ఆడుతున్నాడు. అంతేకాదు పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ప్రాంఛైజీకి ఆడిన ఆటగాళ్లలో హర్భజన్ సింగ్ ఒకరు కాగా, ఇంకొకరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ ఇద్దరూ 2008 నుంచి ఒకే ప్రాంఛైజీకి ఆడుతున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+