నాకేమన్నా 50 ఏళ్లున్నాయా: భజ్జీ ఘాటు వ్యాఖ్య
ముంబై: ఆటతీరు బాగుండాలి గానీ వయసుతో పనేముందని టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ (35) అన్నాడు. ఆస్ర్టేలియా పర్యటనలో జరిగే ట్వంటీ 20 సిరీస్ కోసం ఎంపికైన జట్టులో హర్భజన్ చోటు దక్కించుకున్నాడు. వయసు మీరిందని తమను విమర్శించేవారికి ఘాటైన సమాధానమిచ్చాడు.
'నాకేమన్నా 50 ఏళ్లున్నాయా? నడవలేకపోతున్నానా? అయినా ఆట బాగుండాలేగానీ వయసుతో పనేముంది. చాలామం ది ఆటగాళ్లు 38-39 ఏళ్లదాకా ఆడారు కూడా. ఇంకా ఆడాలన్న కాంక్ష నాలో ఉంది. ఎంపికయ్యేందుకు అది చాలదా' అని హర్భజన్ అన్నాడు. వయస్సు గురించి ఈ గొడవేమిటని అన్నాడు. 38-39 ఏళ్ల వయస్సు వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారున్నారని చెప్పాడు.

భారత జట్టుకు తనతోపాటు బెస్ట్ ఫ్రెండ్ ఆశీష్ నెహ్రా కూడా ఎంపికవడం ఆనందంగా ఉందని భజ్జీ చెప్పాడు. భారతకు వరల్డ్‌క్‌పను అందించాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. బౌలింగ్‌తోపాటు 7-8 స్థానాల్లో బ్యాటింగ్ కూడా చేయగలనని హర్భజన్ అన్నాడు.
తాను సమర్థత మీద ఆధారపడుతానని, ఆ సమర్థత కారణంగానే 15 ఏళ్లు నిలబడ్డానని అన్నాడు. కారమ్ బాల్ వంటి వాటితో తాను ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను తీసిన 700కు పైగా వికెట్లను తన నుంచి ఎవరూ లాక్కోలేరని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications