విరాట్‌ కోహ్లీకి కెప్టెన్సీ భారం కాదు.. అండగా నిలిచిన వెటరన్ క్రికెటర్

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ ఏ మాత్రం భారం కాదని, అతను సవాళ్లను ఎదుర్కోవడానికే ఇష్టపడతాడని భారత వెటరన్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ అన్నాడు. కరోనా విరామం తర్వాత ఆడిన తొలి సిరీస్‌ను భారత్‌ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 51 పరుగులతో ఓడిన భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0-2తో సమర్పించుకుంది. దాంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర విమర్శలు వచ్చాయి.

అతని సారథ్యలోపం వల్లే భారత్ ఓడిందని, అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమైంది. అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లీపై విమర్శలు గుప్పించే గౌతం గంభీర్ సైతం.. విరాట్ కెప్టెన్నీ అర్థం కాలేదన్నాడు. చెత్త కెప్టెన్సీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే హర్భజన్ సింగ్ మాత్రం విరాట్ కోహ్లీని వెనుకేసుకొచ్చాడు.

కోహ్లీ జట్టును నడిపించగలడు..

కోహ్లీ జట్టును నడిపించగలడు..

మ్యాచ్ అనంతరం ఇండియా టూడేతో మాట్లాడుతూ... కోహ్లీకి సారథ్యం వహించడం భారం కాదని, కెప్టెన్‌గా అతడెలాంటి ఒత్తిడికి గురవడం లేదని పేర్కొన్నాడు. కోహ్లీ నాయకుడని, ముందుండి జట్టును నడిపిస్తాడని, ఇతరులకు ప్రేరణగా నిలుస్తాడని చెప్పాడు. ‘కెప్టెన్సీతో కోహ్లీ ఒత్తిడికి లోనవుతున్నాడని నేను అనుకోవడం లేదు. సారథ్యం అతనికి ఏ మాత్రం భారం కాదు. అతనో లీడర్. జట్టును ముందుండి నడిపిస్తూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తాడు. జట్టు కోసం విజయాలందిస్తాడు.'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

ఒక్కడు ఏం చేయలేడు..

ఒక్కడు ఏం చేయలేడు..

కెప్టెన్సీ వల్ల కోహ్లీ ఆట దెబ్బతింటుందనే వాదనలో నిజం లేదన్నాడు. ‘కెప్టెన్సీ కోహ్లీ ఆటపై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. కోహ్లీ ఒక్కడే మ్యాచ్ గెలిపించలేడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత కూడా నేను ఇదే విషయం చెప్పాను. రోహిత్‌, విరాట్‌ ఇద్దరే ఎక్కువ పరుగులు చేస్తున్నారు. రాహుల్‌ బాగా ఆడుతున్నా మిగిలిన ఆటగాళ్లు కూడా నిలకడగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అలా జరిగితే కెప్టెన్‌ మీద భారం తగ్గుతుంది. దాంతో అతను స్వేచ్ఛగా ఆడగలుగుతాడు.'అని భజ్జీ పేర్కొన్నాడు.

స్పిన్‌తో స్మిత్‌ను కట్టడి చేయాలి..

స్పిన్‌తో స్మిత్‌ను కట్టడి చేయాలి..

ఇక రెండు వన్డేల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో భారత బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన స్మిత్‌ను స్పిన్‌తో కట్టడి చేయాలని హర్భజన్ సింగ్ సూచించాడు. స్మిత్ ఎప్పుడూ పేస్‌ను ఆడటానికి ఇష్టపడుతాడని తెలిపాడు. ఒకసారి స్పిన్ బౌలింగ్‌‌లో అతని బ్యాటింగ్ పరీక్షించాలన్నాడు. అతను క్రీజులోకి వచ్చినప్పుడు ఇద్దరు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలన్నాడు. 7-8 ఓవర్లు బౌలింగ్ చేసి చూడాలన్నాడు.

చహల్‌కు సలహా..

చహల్‌కు సలహా..

చహల్ బౌలింగ్ విషయంలో ఎలాంటి తప్పులేదన్నాడు. ఐపీఎల్‌లో అతను చెలరేగడానికి పిచ్‌లే కారణమని, యూఏఈతో పోలిస్తే ఆస్ట్రేలియాలో అవి పూర్తి భిన్నంగా ఉంటాయన్నాడు. అందువల్లే చాహల్‌ వికెట్లు తీయలేకపోతున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ చెప్పినట్లు కంగారూ ఆటగాళ్లకు తమ మైదానాలపై పూర్తి అవగాహన ఉందని, ఆ పరిస్థితులను వారు సద్వినియోగం చేసుకుంటున్నారని వివరించాడు. చాహల్‌ రాణించాలంటే బంతిని కాస్త నెమ్మదిగా వదలాలని, దాంతో అది కొంచెం టర్న్‌ తీసుకుంటుందని సూచన చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Monday, November 30, 2020, 14:19 [IST]
Other articles published on Nov 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X