Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harbhajan Singh: '2 లేదా 20 కోట్లా అన్న‌ది ముఖ్యం కాదు.. కుటుంబ విలువ‌వ‌ల‌కే భ‌జ్జీ ప్రాధాన్యం'

Harbhajan Singh’s Friend Reveals the Reason Behind his withdrawal from IPL 2020

ముంబై: చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఐపీఎల్ 2020కి దూరమయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు శుక్రవారం భ‌జ్జీ స్పష్టం చేశాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో (త‌ల్లి అనారోగ్యం దృష్యా) కుటుంబంతోనే ఉండాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు. హ‌ర్భ‌జ‌న్ నిర్ణ‌యాన్ని సీఎస్‌కే యాజమాన్యం కూడా స్వాగ‌తిస్తూ.. అత‌నికి మ‌ద్ద‌తుగా నిలిచింది. అయితే కొంత‌మంది మాత్రం క‌రోనా భ‌యంతోనే హ‌ర్భ‌జ‌న్ ఐపీఎల్ 2020కి దూరంగా ఉన్నాడంటూ ఆరోపించారు.

 ‌కరోనా భ‌యంతోనే దూరం:

‌కరోనా భ‌యంతోనే దూరం:

ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ వెళ్లిన సీఎస్‌కే జ‌ట్టులోని 13 మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్లేయర్లు దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సహా ఆ టీమ్‌లోని 11 మంది స్టాఫ్ కరోనా వైరస్ బారినడ్డారు. దీంతో క‌రోనా భ‌యంతోనే హ‌ర్భ‌జ‌న్ చెన్నై జ‌ట్టుకు దూరంగా ఉన్నాడంటూ కొంత‌మంది ఆరోపించారు. దీనిపై హ‌ర్భ‌జ‌న్ స్నేహితుడొక‌రు స్పందిస్తూ.. ఓ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు అవాస్తవాలను ప్రచారం చేయొద్దని, అన్నీ తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు.

 వ్య‌క్తిగ‌త కార‌ణాలతోనే:

వ్య‌క్తిగ‌త కార‌ణాలతోనే:

'కేవ‌లం వ్య‌క్తిగ‌త కార‌ణాలతోనే హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఐపీఎల్ 2020‌లో పాల్గొన‌డం లేదు. అంతేకానీ దుబాయ్‌లో ఉన్న ప‌రిస్థితులు దృశ్యా అత‌ను దూర‌మ‌వ‌లేదు. ఐపీఎల్ 13వ సీజ‌న్ ఆడేందుకు భ‌జ్జీ జ‌ట్టుతో పాటు దుబాయ్‌కు వెళ్ల‌లేదు. త‌ల్లి అనారోగ్యం దృష్యా ఫ్యామిలీతో గ‌డ‌పాల‌నే నిర్ణ‌యంతో గ‌త మూడు నెల‌లుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌కు కూడా వెళ్లలేదు. ఇది అందరూ అర్ధం చేసుకోండి. అంతేకాని అవాస్తవాలను ప్రచారం చేయొద్దు' అని హ‌ర్భ‌జ‌న్ స్నేహితుడు కోరారు.

 భ‌జ్జీ దృష్టిలో డ‌బ్బు చివరి ఆప్ష‌న్:

భ‌జ్జీ దృష్టిలో డ‌బ్బు చివరి ఆప్ష‌న్:

'ఈ స‌మ‌యంలో హ‌ర్భ‌జ‌న్ ఐపీఎల్ ఆడినా ఆట మీద ఎక్కువ ఫోక‌స్ చేయ‌లేడు. అందుకే త‌న‌కు కుటుంబం కంటే ఏది ఎక్కువ కాద‌ని భావించే ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఒక‌వేళ భ‌జ్జీ ఐపీఎల్ ఆడితే 2 కోట్లు వస్తాయి. కానీ అది 2 కోట్లా లేక 20 కోట్లా అన్న‌ది ముఖ్యం కాదు. ఎందుకంటే భ‌జ్జీ దృష్టిలో డ‌బ్బు అనేది చివరి ఆప్ష‌న్‌. కుటుంబ విలువ‌వ‌ల‌కే అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఒక‌వేళ మీ కుటుంబంలో మీ భార్య‌కో లేక త‌ల్లికో ఇలాగే జరిగితే అప్ప‌డు మీకు ప‌రిస్థితి ఏంటో అర్థ‌మ‌వుతుంది' అని ఆయన అన్నారు.

ఈ సీజన్ కష్టంగానే:

ఈ సీజన్ కష్టంగానే:

ఐపీఎల్ 2020 చెన్నైకు కష్టంగానే ఉండనుంది. ఇప్పటికే సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్ రైనా జట్టుకు దూరమయ్యాడు. దుబాయ్‌ నుంచి భారత్‌కు వచ్చేశాడు. హ‌ర్భ‌జ‌న్ ఆడడం లేదు. భజ్జీ ఉండుంటే పియూష్‌ చావ్లా, ఇమ్రాన్‌ తాహిర్‌, మిచెల్‌ శాంట్నర్‌కు భారం తగ్గేది. సీనియర్లు లేకపోవడంతో ఉన్న కొద్ది మంది ఆటగాళ్లపైనే భారం ఎక్కువగా పడనుంది. యూఏఈలోని వేడి, ఉక్కపోతను తట్టుకుంటూ విరామం లేకుండా మ్యాచులు ఆడటం కాస్త సవాలే.

ENG vs AUS: టామ్ కరన్ సూపర్ బౌలింగ్.. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ సంచలన విజయం!!

Story first published: Saturday, September 5, 2020, 13:59 [IST]
Other articles published on Sep 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+