కోహ్లీని కొనాలని చూశాం: భజ్జీ ఆసక్తికర విషయం
హైదరాబాద్: ఆధునిక క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. ఫార్మెట్ ఏదైనా సరే పరుగులు రాబట్టడమే కోహ్లీకి తెలుసు. అలాంటి కోహ్లీని ఐపీఎల్‌లో భాగంగా ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలంలో కొనేందుకు ప్రయత్నించినట్టు హర్భజన్ సింగ్ తెలిపారు.
బుధవారం ఓ టీవికి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో హార్భజన్ సింగ్ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన తొలి సీజన్‌లోనే కోహ్లీ ముంబై ఇండియన్స్ కొనాలని ప్రయత్నించిందని, కానీ జరగలేదని చెప్పుకొచ్చాడు.
2008లో నిర్వహించిన వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కేవలం 30వేల డాలర్లకు కోహ్లీని దక్కించుకుందని భజ్జీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఐపీఎల్ 10వ ఎడిషన్‌కు చేరిన తర్వాత కూడా తామిద్దరం మొదటి నుంచి తమ తమ జట్లలోనే కొనసాగుతున్నామని భజ్జీ చెప్పాడు.

2011లో నలుగురు ఆటగాళ్లను వదిలేసిన బెంగుళూరు
2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంఛైజీ నలుగురు ఆటగాళ్లను వదిలేసిందని భజ్జీ అన్నాడు. అందులో కోహ్లీ లేడని, ఒకవేళ కోహ్లీ ఉంటే ముంబై ఇండియన్స్ కోహ్లీని తప్పకుండా దక్కించుకునేదని అన్నాడు. కోహ్లీ మంచి ఆటగాడు మాత్రమే కాదని, అతడిలో మంచి నటుడు కూడా దాగి ఉన్నాడని హార్భజన్ సింగ్ కితాబిచ్చాడు.

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే జట్టుతో
ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఒకే జట్టుతో ఆడుతున్న ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్భజన్ సింగ్‌లు మాత్రమే. రెండు రోజుల క్రితం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కెప్టెన్ కోహ్లీ వన్డేల్లో సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయొచ్చు కానీ టెస్టుల్లో మాత్రం సచిన్‌ను అధిగమించడం చాలా కష్టమని భజ్జీ అన్న సంగతి తెలిసిందే.

కోహ్లీ ఛాంపియన్ ప్లేయరే కానీ
కోహ్లీ ఒక గొప్ప ఛాంపియన్ ప్లేయర్ అని అయితే సచిన్ మాత్రం ఎప్పటికీ నెంబర్ వన్ ఆటగాడని హర్భజన్ సింగ్ అన్నాడు. తన బ్యాటింగ్‌తో క్రికెట్‌లో సరికొత్త స్టాండర్స్‌ను సచిన్ సృష్టించాడని కొనియాడాడు. 'సచిన్ బ్యాటింగ్ రికార్డులను కోహ్లీ బ్రేక్ చేయొచ్చు, కానీ సచిన్ మాత్రం ఎప్పటికీ సచిన్ అని' హర్భజన్ సింగ్ అన్నాడు.

కోహ్లీపై ప్రశంసలు కురిపించిన భజ్జీ
ఈ దేశంలో చాలా మంది ఆటగాళ్లు.. కోహ్లీ నాతో సహా ఈరోజు క్రికెట్ ఆడుతున్నామంటే అది సచిన్ వల్లేనని చెప్పుకొచ్చాడు. ఇక గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్న కోహ్లీపై కూడా భజ్జీ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పట్ల కోహ్లీకి ఉన్న ఫ్యాషన్ తదుపరి లెవెల్‌కు తీసుకెళ్తుందని చెప్పాడు. జట్టుని ఓ కుంటుబంలాగా కోహ్లీ నడిపిస్తున్న తీరు అమోఘమని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications