
టీమిండియా మాజీ బౌలర్ హర్బజన్ సింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మధ్య ఉన్న తేడాల గురించి చెప్పాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిలా కూల్‌గా ఉంటే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్ని పరుగులు సాధించేవాడు కాదని చెప్పుకొచ్చాడు. ఇటీవల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భజ్జీ.. మహేంద్రసింగ్ ధోని.. విరాట్ కోహ్లీకి గల వ్యత్యాసాన్ని చెప్పాడు. ధోని చాలా కూల్‌గా ఉంటాడని చెప్పిన హర్బజన్.. విరాట్ కోహ్లీ దూకుడు స్వభావం వల్లే విదేశాల్లో టీమిండియా ఇన్ని విజయాలు సాధించగలుగుతుందని అన్నాడు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఒక సారి తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఓ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 400పైగా లక్ష్యాన్ని చేధించాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ భారీ సెంచరీ సాధించడాని, కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు ఇండియానే గెలుస్తుందని అంతా భావించినట్టు తెలిపాడు. అయితే కోహ్లీ ఔటయ్యాడు. కోహ్లీ ఫెమిలియన్‌కు వచ్చాడు. ఆ సమయంలో మ్యాచ్ డ్రా అవుతుందని తాను కోహ్లీతో చెప్పినట్టు తెలిపాడు.
కానీ దానికి కోహ్లీ.. డ్రాగా ముగిసే టెస్ట్ మ్యాచ్‌లకు ప్రాముఖ్యత ఉండదని, గెలవాలి లేదా ఓడిపోవాలి అని చెప్పినట్లు భజ్జీ వివరించాడు. చివరి వరకు పోరాడడం నేర్చుకుంటే ఏదో ఒక రోజు కచ్చితంగా గెలుస్తామని కోహ్లీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిపాడు.
ధోని నాయకత్వంలో ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు మ్యాచ్‌లను డ్రా చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. కానీ కోహ్లీ కెప్టెన్సీలో ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఎలా గెలవాలని అని టీం ఆలోచిస్తోందని అన్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియాలో గెలిచిందని, ఇంగ్లండ్‌లో అధిక్యంలో నిలిచిందని చెప్పాడు. ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్‌లోనూ భారత జట్టు గెలుస్తుందని హర్బజన్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ దూకుడు స్వభావం కారణంగానే విదేశాల్లో భారత జట్టు గెలవగలుగుతుందని వెల్లడించాడు. విదేశాల్లో గెలవాలంటే కోహ్లీ లాంటి కెప్టెన్ అవసరం అన్నాడు. దూకుడుతోనే కోహ్లీ దిగ్గజ ఆటగాడిగా ఎదగాడని గుర్తు హర్బజన్ చేసుకున్నాడు.
కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా సెంచూరియన్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 327 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా 197 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 130 పరుగులు భారీ అధిక్యం లభించింది. టీమిండియా ఓపెనర్ లోకేష్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు.