Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎమోషనల్ వీడియో పోస్టు చేసిన వెటరన్ క్రికెటర్ భజ్జీ

హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే క్రికెటర్లలో టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒకరు. తనకు నచ్చిన విషయాలపై, తన తోటి ఆటగాళ్లు పెట్టిన ట్వీట్లకు రిప్లై ఇస్తూ ఉంటాడు. అయితే తాజాగా భజ్జీ పోస్టు చేసిన వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

వీడియోలో బెడ్‌ మీద ఓ చిన్న బాబు పాల కోసం ఏడుస్తుంటాడు. వెంటనే పక్కనే అతని సోదరుడు అది గమనించి దానిని అందించేందుకు యత్నిస్తాడు. అయితే చేతులు లేని ఆ చిన్నారి అతి కష్టం మీద తన నోటితోనే తమ్ముడి నోటికి పీకను అందించాడు. వెంటనే చిన్నారి సైలెంట్‌ అయిపోతుంది.

ఈ వీడియోని వీక్షించిన హర్బజన్ సింగ్ 'మాటల్లేవ్‌.. కన్నీళ్లు మాత్రం వచ్చేశాయ్‌. ఆ చిన్నారుల నుంచి చాలా నేర్చుకోవాలి' అనే కామెంట్‌తో అభిమానుల కోసం వీడియోను కూడా షేర్‌ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+