Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో 100 ఇన్నింగ్స్‌లు: సురేశ్ రైనా తర్వాత ఆ రికార్డు హార్భజన్ సింగ్‌దే..!

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు, టీమిండియా ఆటగాడు హార్భజన్ సింగ్ మరో మైలు రాయిని సాధించాడు. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌తో ఒకే ప్రాంఛైజీ తరుపున 100 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.

ఆదివారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హార్భజన్ సింగ్ 27 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మిగతా బౌలర్లు విఫలమైనా, భజ్జీ మాత్రం మాన్విందర్ బిస్లా, క్రిస్ గేల్, రైలీ రాస్సో లాంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీశాడు.

దీంతో ముంబై విజయం సునాయాశమైంది. ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన రికార్డు కూడా భజ్జీ తన పేరు మీద నమోదు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 191 పరుగులు చేసింది.

Harbhajan Singh plays his 100th IPL game for Mumbai Indians

దీంతో ముంబై జట్టు బెంగుళూరుపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐపీఎల్‌లో ముంబై తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ ఆనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న భజ్జీ మాట్లాడుతూ "100వ మ్యాచ్ ఆడటం చాలా ఆనందంగా ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడటం మరింత సంతోషంగా ఉంది. బౌలింగ్ విషయంలో గత నాలుగు మ్యాచ్‌ల్లో చాలా నిరాశ చెందాను. కానీ, బెంగళూరుతో మ్యాచ్‌లో బాగా రాణించాననిపిస్తోంది. అత్యంత కీలక వికెట్లను పగడొట్టి జట్టు విజయంలో తోడ్పడటం సంతోషాన్నిచ్చింది" అని చెప్పాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు ఒక్క సురేశ్ రైనా పేరు మీదనే ఉంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సురేశ్ రైనా చెన్నై ప్రాంఛైజీ తరుపున 100 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+