IPL 2019: Qualifier 2: అరుదైన రికార్డుకి రెండు వికెట్ల దూరంలో భజ్జీ
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరో అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఈ సీజన్‌లో చెన్నై తరుపున భజ్జీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా టర్నింగ్ పిచ్‌లపై భజ్జీని సీఎస్‌కే కెప్టెన్ ధోని ఉపయోగించుకున్న తీరు నిజంగా అద్భుతం. డాడీస్ ఆర్మీగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున సీనియర్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్‌లు అద్భుతాలు చేశారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ క్రమంలో హర్భజన్ సింగ్ ఓ అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా భజ్జీ ఓ అరుదైన గుర్తింపు పొందనున్నాడు. ఈ జాబితాలో చేరేందుకు హర్భజన్ సింగ్ మరో రెండు వికెట్లు దూరంలో నిలిచాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా భజ్జీ నిలుస్తాడు.

150 వికెట్లు తీసింది వీరే
ఐపీఎల్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లసిత్ మలింగ(169) అగ్రస్థానంలో నిలవగా అమిత్ మిశ్రా(156), పియూష్ చావ్లా(150) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టోర్నీలో భాగంగా శుక్రవారం క్వాలిఫయిర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.

మరో రెండు వికెట్లు తీస్తే
ఈ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీస్తే ఐపీఎల్‌లో 150 వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందుతాడు. 2018 సీజన్‌లో నిరాశ పరిచిన భజ్జీ ఈ సీజన్‌లో మాత్రం దూసుకుపోతున్నాడు. గత సీజన్‌లో భజ్జీ మొత్తం 13 మ్యాచ్‌లాడి 7 వికెట్లు తీశాడు. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్ 14 వికెట్లు తీశాడు.

చెపాక్‌లో ఆరు మ్యాచ్‌ల్లో విజయం
సొంతమైదానమైన చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ లీగ్ స్టేజిలో మొత్తం ఏడు మ్యాచ్‌లాడి ఆరింట విజయం సాధించింది. దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్‌లతో కలిసి హర్భజన్ సింగ్ అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. పవర్ ప్లే ఓవర్లలో వికెట్లు తీసి చెన్నై విజయాల్లో భజ్జీ కీలకపాత్ర పోషించాడు.

విశాఖ స్టేడియం స్పిన్‌కు అనుకూలం
క్వాలిఫయిర్-2 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖరరెడ్డి స్టేడియం స్పిన్‌కు అనుకూలం. దీంతో ఢిల్లీతో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో హర్భజన్ 150 వికెట్ల మైలురాయిని అందుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications