For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నవ్వు తెప్పిస్తోంది: ఇంగ్లీష్ భాష రాక ఇంగ్లాండ్ పర్యటనలో భజ్జీ, కైఫ్ కష్టాలు

By Nageshwara Rao
 Harbhajan Singh, Mohammad Kaif recall their struggle with English language

హైదరాబాద్: హర్భజన్ సింగ్... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను సంపాదించుకున్నాడు. తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్లకు ముప్పుతిప్పులు పెట్టాడు. మోడ్రన్ ఎరాలో టీమిండియా చూసిన అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకడు.

తన దూస్రాలతో ప్రత్యర్ధి జట్లకు చెందిన ఎంతోమంది బ్యాట్స్‌మెన్లను అయోమయంలో పడేశాడు. అలాంటి హర్భజన్ సింగ్ తన తొలి ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లీష్ భాషతో ఇబ్బందికి గురయ్యాడంట. ఈ విషయాన్ని భజ్జీ 'వాట్ ద డక్' అనే వెబ్ సిరిస్ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించాడు.

తన తొలి ఇంగ్లాండ్ పర్యటనలో మైదానంలో అద్భుత ప్రదర్శన చేశానని, అయితే ఇంగ్లీష్ లాంగ్వేజి వేసిన 'దూస్రా'కు మాత్రం ఔటయ్యానని చెప్పుకొచ్చాడు. హర్భజన్ సింగ్‌కు ఇంగ్లీష్ భాషపై పెద్దగా పట్టులేదు. మ్యాచ్ అనంతరం ఓ రిపోర్టర్ భజ్జీని మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? అని అడిగాడు.

అయితే ఇంగ్లీష్ భాష రాని భజ్జీకి ఆ మాట రిజర్వేషన్ చేయించుకున్నారా? అని అర్ధం అయింది. దీంతో భజ్జీ "అవును సర్, నేను రిజర్వేషన్ చేయించుకున్నాను. నేను రేపు వెళ్తున్నాను" అని సమాధానం ఇవ్వడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి.

అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లీష్ భాష రాక ఇబ్బంది పడిన ఆటగాళ్లలో భజ్జీతో పాటు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా ఉన్నాడు. మహమ్మద్ కైఫ్ కూడా ఇంగ్లీష్ భాష రాకపోవడంతో తాను కూడా ఓ సారి హోటల్లో ఇబ్బంది పడిన సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు.

తన ఇంగ్లాండ్ తొలి పర్యటనలో హోటల్‌లో రిసెస్పనిస్ట్ నుంచి గది తాళాలు ఎలా అడిగి తీసుకోవాలో తెలియక చివరకు తన రూమ్‌మేట్‌తో గది తాళాలు తెప్పించినట్లు మహమ్మద్ కైఫ్ వెల్లడించాడు. "ఆరోజుల్లో ఇంగ్లాండ్‌లో బయటకు వెళ్లేటప్పుడు గది తాళాలు రిసెప్షన్ డెస్క్‌లో ఇచ్చి, తిరిగి గదికి వచ్చేటప్పుడు రిసెప్షన్ వద్ద నుంచే తాళాలు అడిగి తీసుకోవాలి. ఒకరోజు నేను హోటల్‌కు తిరిగి వచ్చాను. రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్లి గది తాళం ఇవ్వమని సైగ చేశా. అందుకు అక్కడ ఉన్న ఆమె 'మే ఐ హ్యావ్ ద కీస్ ప్లీజ్' అని అడిగితేనే ఇస్తానని చెప్పింది. అందుకు నేను 'కీస్ ప్లీజ్' అని మళ్లీ అడిగా. ఆమె మాత్రం 'మే ఐ హ్యావ్ ద కీస్ ప్లీజ్' అని అడిగాల్సిందిగా నాతో గొడవ పడింది. దీంతో నేను నా రూమ్ పాట్నర్ వద్దకు వెళ్లి రిసెప్షనిస్ట్ వద్ద నుంచి గది తాళాలు తీసుకురావాల్సిందిగా చెప్పా" అని కైఫ్ అప్పటి సంగతిని గుర్తు చేసుకున్నాడు.

Story first published: Thursday, May 31, 2018, 17:24 [IST]
Other articles published on May 31, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+