ఆసీస్‌పై భజ్జీ వ్యాఖ్యలు: ట్విట్టర్‌లో వెక్కిరింత, హేళన చేశారు
హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత పర్యనటకు వచ్చిన ఆసీస్ జట్టు ఘోరంగా ఓటమి పాలవుతుందని జోస్యం చెప్పిన వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో అటు ఆసీస్ వెటరన్ క్రికెటర్లు, ఇటు ఆసీస్ ఆటగాళ్లు సైతం భజ్జీపైకి ఎదురుదాడికి దిగారు.
టెస్టు సిరిస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాగానే ఇంత చెత్త జట్టును ఎప్పుడూ చూడలేదని హార్భజన్ సింగ్ వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు టీమిండియా ఈ సిరిస్‌ను 4-0 తేడాతో సొంతం చేసుకుంటుందని కూడా చెప్పాడు.
భజ్జీ వ్యాఖ్యలను వమ్ము చేసిన ఓకీఫ్
అయితే ఈ సిరిస్‌లో ఆస్ట్రేలియా బాగా ఆడినా 3-0తో టీమిండియా గెలుస్తుందనే నమ్మకాన్ని సైతం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పూణెలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో పరిస్థితి అంతా తారుమారైంది. పూణె టెస్టులో ఆసిస్ స్పిన్నర్ ఓకీఫ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా నడ్డి విరిచాడు.
రికార్డు సృష్టించిన ఓకీఫ్
రెండు ఉన్నింగ్స్‌ల్లో కలిపి 75 పరుగులిచ్చిన ఓకీఫ్ 12 వికెట్లు తీసుకుని టెస్టుల్లో ఓ రికార్డుని సైతం సృష్టించాడు. పూణె టెస్టు విజయం అనంతరం స్మిత్‌ను ప్రశంసిస్తూ భజ్జీ ట్వీట్ చేశాడు. పూణె పిచ్‌పై ప్రతీ బంతికి కష్టపడాల్సి ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియన్లు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు.
భజ్జీని వెక్కిరించిన డేవిడ్‌వార్నర్
అయితే రాబోయే టెస్టుల్లో టీమిండియా తప్పకుండా పుంజుకుంటుందనే ఆశాభావాన్ని హార్భజన్ సింగ్ వ్యక్తం చేశాడు. ఫలితాన్ని చూసి ఆనందం పట్టలేకపోయాడో, లేక భజ్జీ మాటలు గుర్తొచ్చాయో గానీ ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. అప్పట్లో హర్భజన్ చేసిన ట్వీట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ట్విట్టర్ పేజీలో రీట్వీట్ చేశాడు.
ఆసీస్‌పై ప్రశంసలు కురిపించిన షేన్ వాట్సన్
తొలి టెస్టులో భారత్‌పై 333 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియాపై ఆ దేశ మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే భజ్జీ జోస్యంపై అభిమానులు కూడా బాగా సెటైర్లు వేశారు. ఆసీస్ జట్టు బలహీనమైందని ఇంకా నమ్ముతున్నావా? అంటూ కొందరు ట్వీట్ చేసి హేళన చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications