న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి కూడా ఎంపికయ్యాడు. కానీ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
అయితే భజ్జీ ఇప్పటి వరకు రిజర్వు బెంచ్‌కే పరి మితం కావడంపై ట్విట్టర్‌లో ఓ వ్యక్తి వ్యం గ్యంగా కామెంట్‌లు రాశాడు. 'సోదరా, నీ భారత టూర్ ఎలా ఉంది.? మజా చేస్తుండొచ్చు? హోటళ్లు, లంచ్, డిన్నర్.. అన్నీ ఉచితమేగా. మస్త్ లైఫ్' అంటూ ట్వీట్ చేశాడు. దీనిని చూసిన హర్భజన్‌కు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.
దీంతో తన కూల్‌నెస్‌ను పక్కన బెట్టి ఆ యూజర్‌కు ఘాటుగా జవాబిచ్చాడు భజ్జీ. 'ఏనుగు పోతుంటే వీధి కుక్కలు మొరుగుతుంటాయి. వాటిలో నువ్వొకడివి' అని నోరుమూయించేలా సమాధానమిచ్చాడు.

కాగా, ఇదే రోజు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి కూడా కొందరు సోషల్ మీడియాలో కామెంట్ల ద్వారా ఆగ్రహం తెప్పించారు. అనుష్క దూరమవడం వల్లే కోహ్లీ బాగా ఆడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేయడంపై కోహ్లీ మండిపడ్డాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుపడాలని కోహ్లీ ఘాటుగా సమాధానమిచ్చాడు.
ఇది ఇలా ఉండగా, భజ్జీ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు భారత జట్టులో ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో భజ్జీ బెంచ్ కే పరిమితమయ్యాడు.