
హైదరాబాద్: ప్రేక్షకులను, అభిమానులను అలరించే దిశగా చెన్నై సూపర్ కింగ్స్ మరో కొత్త అధ్యాయానికి తెరలేపనుంది. చెన్నై జట్టు ఆటగాళ్లందరితో కలిపి ప్రత్యేక కార్యక్రమం ఒకటి నిర్వహిస్తుంది. దీనికి వ్యాఖ్యాతగా భజ్జీ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. దాని పేరే.. 'క్విక్ హీల్ హర్భజన్ బ్లాస్ట్ విత్ సీఎఎస్‌కే'
దీనికి సంబంధించిన టీజర్‌ను సోమవారమే విడుదల చేసిన భజ్జీ టీజర్‌లో ప్రామిస్ చేసినట్లుగానే 'భజ్జీ బ్లాస్ట్' షోలో ఇరగదీశాడు. అన్‌లిమిటెడ్ ఫన్, మస్త్ మస్త్ మూమేంట్స్‌తో కూడిన 'భజ్జీ బ్లాస్ట్' ట్రైలర్ ఒక రోజు ముందే విడుదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో మాట్లాడుతూ, ఆటలాడిస్తూ సాగే ఈ టాక్‌షో ఇప్పటికే చర్చనీయాంశమైంది. షో పూర్తిపేరు'క్విక్ హీల్ హర్భజన్ బ్లాస్ట్ విత్ సీఎఎస్‌కే'.
ధోనీ ఎక్కడ?: రవీంద్ర జడేజా క్రికెటర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవాడో.. అని అడిగిన ప్రశ్నకు ఎవరో ఒకరి గుర్రాల కాసుకుంటూ ఉండేవాడిని అని బదులిచ్చిన జడేజాతో కూడిన క్లిప్పింగ్‌తో టీజర్ విడుదల చేశారు. ఇంకా క్రికెట్‌లో స్లెడ్జింగ్ ఆస్ట్రేలియన్ల డీఎన్‌ఏలోకి ఎలా దూరిందో.. విదేశీ అమ్మాయి నుంచి భజ్జీ ఎదుర్కొన్న తలపాగా చిక్కేమిటో.. షారూఖ్ సెనోరీటా డైలాగ్‌ను బ్రేవో ఎలా చెప్పాడో.. తదితర ఆసక్తికర దృశ్యాలన్నీ ట్రైరల్‌లో పొందుపర్చారు.
ఈ ట్రైలర్‌లో సీఎస్‌కే కెప్టెన్ ధోనీ కనిపించకపోవడంపై అభిమానులు సందేహాలు నెలకొన్నాయి. ఎపిసోడ్లుగా అతిత్వరలోనే ప్రసారం కానున్న ఈ షో మరిన్ని వివరాలను భజ్జీ అఫీషియల్ అకౌంట్ ద్వారా తెలుసుకోవచ్చు..