For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్భజన్‌ సింగ్‌ రిటైర్మెంట్‌ త్వరలోనే?!!.. అందుకు కారణం ఏంటంటే!!

Harbhajan Singh, Harbhajan Singh retirement

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ త్వరలో రిటైర్మెంట్‌ ప్రకటించనున్నారు. అందుకు కారణం ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ (ఈసీబీ) నిర్వహించనున్న 'ద హండ్రెడ్‌' లీగ్‌ అని సమాచారం తెలుస్తోంది. జూలై 2020లో ప్రారంభమయ్యే 'ద హండ్రెడ్‌' (వంద బంతుల టోర్నీ)ప్లేయర్ డ్రాఫ్ట్‌లో హర్భజన్‌ తన పేరును నమోదు చేసుకున్నాడట. దీంతో ద హండ్రెడ్‌ ప్లేయర్ డ్రాఫ్ట్‌లో పేరును నమోదు చేసుకున్న తొలి భారతీయ ఆటగాడిగా హర్భజన్ సింగ్ నిలిచాడు.

 లీగ్‌లో పాల్గొనాలంటే రిటైర్మెంట్‌ను ప్రకటించాలి:

లీగ్‌లో పాల్గొనాలంటే రిటైర్మెంట్‌ను ప్రకటించాలి:

ద హండ్రెడ్‌ లీగ్‌ను ఈసీబీ గురువారం అధికారికంగా లాంచ్‌ చేసింది. ప్లేయర్ డ్రాఫ్ట్‌లో తమ పేర్లను నమోదుచేసుకున్నట్టు పలువురు ఆటగాళ్లు పేర్లు వార్తల్లోకి వచ్చాయి. భారత్‌ నుంచి హర్భజన్‌ ఒక్కడే నమోదు చేసుకున్నాడని సమాచారం. అయితే భారత క్రికెటర్లు విదేశీ టీ20 లీగ్‌లో ఆడటానికి ఇంకా బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకని హర్భజన్‌.. ద హండ్రెడ్‌ లీగ్‌లో పాల్గొనాలంటే ముందుగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆరంభానికి ముందే హర్భజన్‌ తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకోవాలి.

ఐపీఎల్‌ను కూడా వదులుకోవాలి:

ఐపీఎల్‌ను కూడా వదులుకోవాలి:

ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు హర్భజన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. హర్భజన్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకలేదు. అయితే భారత జట్టుకు ఆడి దాదాపు మూడేళ్లు అవుతోంది. చివరిసారిగా ఆసియాకప్ 2016లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల యువరాజ్ సింగ్ గ్లోబల్ కెనడా టీ20లో పాల్గొన్నాడు. అయితే యువీ రిటైర్ అయినందున కెనడా టీ20లో ఆడాడు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌కు కూడా యువీ వీడ్కోలు చెప్పడంతోనే.. విదేశీ లీగ్‌లో ఆడే అవకాశం దక్కింది. ఈ లెక్క ప్రకారం హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంతో పాటు ఐపీఎల్‌ను కూడా వదులుకోవాలి.

ఎన్‌ఓసీ సర్టిఫికేట్‌ కోరలేదు:

ఎన్‌ఓసీ సర్టిఫికేట్‌ కోరలేదు:

హర్భజన్‌ సింగ్‌పై వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. 'మా నుంచి హర్భజన్‌ ఎటువంటి ఎన్‌ఓసీ సర్టిఫికేట్‌ కోరలేదు. హర్భజన్‌ అసలు మమ్మల్ని కలవలేదు, మాతో మాట్లాడలేదు. హర్భజన్‌ ఏ లీగ్‌ కోసం తన పేరును ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే.. అది బీసీసీఐ రూల్స్‌కి వ్యతిరేకం' అని పేర్కొంది. బీసీసీఐ ఇలా స్పందించడంతో.. హర్భజన్‌ సింగ్‌పై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తేలాలంటే అతడు స్పందిస్తేనే అసలు విషయం తేలనుంది.

హండ్రెడ్‌ లీగ్‌లో 8 దేశవాళీ జట్లు:

హండ్రెడ్‌ లీగ్‌లో 8 దేశవాళీ జట్లు:

2020లో నిర్వహించనున్న ద హండ్రెడ్‌ లీగ్‌లో 8 దేశవాళీ జట్లు పాల్గొంటున్నాయి. ఈ వంద బంతుల ఫార్మాట్‌లో 15 సాధారణ ఓవర్లు ఉంటే.. ఒక ఓవర్లో మాత్రం పది బంతులు ఉంటాయి. టీటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో ఓవరాల్‌గా 40 బంతులు తక్కువగా ఉంటాయి కాబట్టి దాదాపు రెండున్నర గంటల సమయం తగ్గుతుంది. 100 బంతుల క్రికెట్ మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ లీగ్‌లో మహిళల జట్లు కూడా పాల్గొంటున్నాయి.

Story first published: Friday, October 4, 2019, 14:05 [IST]
Other articles published on Oct 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+